Harbhajan Singh: దాదా వెంట ఎవరున్నా, లేకున్నా.. చచ్చేవరకు నేనుంటా.. హర్భజన్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్
తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ దాదాపై నెగెటివ్ కామెంట్లు చేశాడు. విరాట్ కోహ్లీ అంటే గంగూలీకి ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదని, ఆ కారణంతోనే రోహిత్ శర్మను కెప్టెన్ చేశాడంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
భారత్ క్రికెట్ జట్టు తలరాతను మార్చిన ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు ముందుంటుంది. అభిమానులందరూ ముద్దుగా దాదా, బెంగాల్ టైగర్ అని పిల్చుకునే గంగూలీ ఒక వరల్డ్ కప్ కూడా అందించలేకపోవచ్చు. కానీ భారత క్రికెట్ జట్టు రూపు రేఖల్ని మార్చిన ఘనత మాత్రం మొదట గంగూలీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫిక్సింగ్‌తో కుదేలైన సమయంలో టీమిండియా పగ్గాలు అందుకున్న సౌరవ్.. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేశాడు. యువరాజ్, జహీర్‌ఖాన్, హర్భజన్, సెహ్వాగ్, ధోనీ లాంటి ట్యాలెంటెడ్ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. అగ్ర జట్టు ఆస్ట్రేలియాకు ధీటుగా టీమిండియాను తీర్చిదిద్దాడు. అందుకే చాలా మంది గొప్ప క్రికెటర్లకు గంగూలీ అంటే ఎంతో ఇష్టం.. అంతకుమించి గౌరవం. వారందరూ అనేక సంబర్భాల్లో దాదాపై తమకున్న ప్రేమ, గౌరవాన్ని వెల్లడించారు. అలాంటి గంగూలీని ఇప్పుడు విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ దాదాపై నెగెటివ్ కామెంట్లు చేశాడు. విరాట్ కోహ్లీ అంటే గంగూలీకి ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదని, ఆ కారణంతోనే రోహిత్ శర్మను కెప్టెన్ చేశాడంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మొత్తానికి కోహ్లీ కెప్టెన్సీ విషయంలో దాదాను పూర్తిగా విలన్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోంది.
ఈ వ్యవహారంపై దాదా అభిమానులు ఫైర్ అవుతున్నారు. చేతన్ శర్మ కావాలనే గంగూలీ గురించి విమర్శలు చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. గంగూలీకి ఫుల్ సపోర్టునిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ సైతం ఒకనొక సందర్భంలో గంగూలీ గురించి ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో భజ్జీ మాట్లాడుతూ..‘నా కష్ట కాలంలో ఎవరైన అండగా నిలిచారంటే అది సౌరవ్ గంగూలీనే. నాతో ఎవరు ఉన్నా లేకున్నా, గంగూలీకి కోసం ఎవరు నిలబడినా, నిలబడకపోయినా.. నేను చచ్చే వరకు దాదా కోసం నిలబడతా, నా పెద్ద అన్న లేడు. ఒక వేళ ఉన్నా కూడా దాదా చేసినంత సహాయం నా కోసం చేసే వాడు కాదేమో. థ్యాంక్యూ దాదా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం చేతన్ శర్మ వ్యవహారంలో దాదాకు మద్దతుగా ఎవరూ లేకపోయినా.. తామున్నామంటూ గంగూలీ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
Selfless achievement has a bigger satisfaction than self achievement.? Love You Dada ❤️ Proud to be your Fan ?@SGanguly99 @harbhajan_singh#SouravGanguly #Ganguly#IamGangulian pic.twitter.com/wb8CD6nGry
— Pambi Praveen Kumar (@PraveenPKBRS) February 16, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..