IND vs AUS 2nd Test Preview: రెండో టెస్టులో ఆ సీనియర్ ప్లేయర్లకు నో ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-XI ఎలా ఉండనుందంటే?
లి టెస్టు మ్యాచ్‌లో భారీ విజయం సాధించినా.. కొందరు ఆటగాళ్ల ఆటతీరు టీమ్‌ఇండియాకు టెన్షన్ పెట్టిస్తోంది. ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
India vs Australia Probable Playing XI: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టెస్టు స్పెషలిస్ట్‌గా పేరొందిన బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా కెరీర్‌లో ఈ మ్యాచ్ 100వ టెస్టు కావడం విశేషం. దీంతో భారీ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ టెస్టును మధురమైన జ్ఞాపకంగా మల్చుకోవాలనుకుంటున్నాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో భారీ విజయం సాధించినా.. కొందరు ఆటగాళ్ల ఆటతీరు టీమ్‌ఇండియాకు టెన్షన్ పెట్టిస్తోంది. ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఢిల్లీలో టీమ్ ఇండియాకు ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా ఆటగాళ్లు నాగ్‌పూర్ టెస్టులో పెద్దగా రాణించలేకపోయారు. మరో ఓపెనర్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ, పుజారా కూడా పెద్దగా పరుగులేమీ చేయలేదు. మరి ఢిల్లీ టెస్టులోనైనా వీరు రాణిస్తారా?లేదా? అన్నది చూడాలి. కాగా ఈమ్యాచ్‌లో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇప్పటివరకు 46 టెస్ట్‌లు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ రాహుల్ ఈ ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేకపోతున్నారు. అతని సగటు కూడా 34 కంటే తక్కువగా ఉంది. సో కాబట్టి ఢిల్లీలో రాహుల్ స్థానంలో గిల్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
బౌలింగ్‌లో మార్పులు లేనట్లే..
కాగా చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ స్టార్లు కూడా సూపర్ ఫ్లాప్ అయ్యారు. అయితే పూజారా, కోహ్లీ స్థానాలకు పెద్దగా ఇబ్బంది లేకున్నా సూర్యకు మాత్రం ఢిల్లీ టెస్టులో చోటు దక్కకపోవచ్చు. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను చూడొచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. బౌలర్ల ప్రతిభ ఆధారంగానే భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. జడేజాతో పాటు అశ్విన్ అద్భుతంగా రాణించారు. కాబట్టి రెండో టెస్టులోనూ ఇదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. వీరితో పాటు అక్షర్ పటేల్‌కు కూడా కంటిన్యూ కానున్నాడు. ఇదే జరిగితే మరోసారి కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
‘A journey full of hard-work, persistence & grit’ ? ?
?? ??? ????: Wishes & tributes pour in as #TeamIndia congratulate the ever-so-gutsy @cheteshwar1 ahead of his ?th Test ? ?
Watch the SPECIAL FEATURE ? ? #INDvAUS https://t.co/d0a2LjFyGh pic.twitter.com/lAFpNcI7SF
— BCCI (@BCCI) February 16, 2023
కాగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా పిచ్‌పై తేమ ఆరిపోయినప్పుడు, ఈ పిచ్ నిర్జీవంగా మారుతుంది. కోట్లా పిచ్ నాగ్‌పూర్ కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మరోవైపు గ్రౌండ్‌కు ఒకవైపు చిన్న బౌండరీ ఉంటే, లెగ్ సైడ్‌లో బౌండరీ దాదాపు 60 మీటర్లు ఉండటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఓల్డ్ పెవిలియన్ ఎండ్ నుండి నాథన్ లియాన్‌ను బౌలింగ్ చేయించే అవకాశం ఉంటుంది.
— BCCI (@BCCI) February 16, 2023
రెండో టెస్టుకు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..