AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: కెరీర్‌లో వందో టెస్ట్‌.. నయావాల్‌ను ఘనంగా సత్కరించిన బీసీసీఐ.. టీమిండియా నుంచి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17) భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ టెస్టుతో టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చెతేశ్వర్ పుజారా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

IND vs AUS: కెరీర్‌లో వందో టెస్ట్‌.. నయావాల్‌ను ఘనంగా సత్కరించిన బీసీసీఐ.. టీమిండియా నుంచి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌
Cheteshwar Pujara
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2023 | 12:21 PM

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17) భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ టెస్టుతో టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చెతేశ్వర్ పుజారా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 13వ భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీల క్లబ్‌లో పుజారా చేరాడు. ఈనేపథ్యంలో నయావాల్‌ను ఘ‌నంగా స‌త్కరించింది బీసీసీఐ. ఈ సందర్భంగా భారత దిగ్గజం సునీల్ గ‌వాస్కర్‌ చేతుల మీదగా పుజారా స్పెషల్‌ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ స్పెషల్‌ ఈవెంట్‌లో నయావాల్‌తో పాటు, అతని మొదటి కోచ్‌, తండ్రి అరవింద్ పుజారా, భార్య, కుమార్తె కూడా సందడి చేశారు. ఇక వందో టెస్టు ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పుజారాకు సహాచర ఆటగాళ్ల నుంచి ‘గార్డ్ ఆఫ్ హానర్’ లభించింది. తొలి రోజు ఆట సందర్భంగా అతను ఫీల్డింగ్‌ వస్తుండగా.. టీమిండియా ఆటగాళ్లు లైన్‌లో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ నయావాల్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో పలువురు క్రికెట్‌ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు టెస్ట్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌కు అభినందనలు చెబుతున్నారు.

కాగా సునీల్‌ గవాస్కర్‌తో స్పెషల్‌ క్యాప్ అందుకున్న తర్వాత ఎమోషనల్‌ అయ్యాడు పుజారా. ఈ సందర్ఱభంగా గవాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అతను మీ నుండి ఈ క్యాప్ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ‘మీలాంటి అనుభవజ్ఞులు నాకు స్ఫూర్తినిస్తున్నారు. తొలినాళ్లలో భారత్ తరఫున ఆడాలని కలలు కన్నాను. కానీ భారత్ తరఫున 100 టెస్టులు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్‌నే అత్యుత్తమ ఆటగా భావిస్తున్నాను. టెస్టు క్రికెట్‌కు జీవితానికి చాలా సారూప్యత ఉంది. మీరు కష్ట సమయాల్లో పోరాడగలిగితే, మీరు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు’ అంటూ తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు పుజారా. కాగా భారత్‌ తరఫున ఇప్పటివరకు100 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్‌ సెంచరీలు, 19 శతకాలు, 34 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..