AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo: కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు.. కనీసం పిల్లలనైనా వదిలేయాలంటూ ఖుష్బూ సీరియస్

తాజాగా ప్రముఖ సీనియర్‌ నటి ఖుష్బూ ఫ్యామిలీ ఈ బాడీ షేమింగ్‌ బారిన పడ్డారు. ఆమె కూతుళ్లపై కొందరు నెటిజన్లు అభ్యంతకర కామెంట్లు చేశారు. దీనిపై ఖుష్బూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిల్లలైనా వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

Kushboo: కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు.. కనీసం పిల్లలనైనా వదిలేయాలంటూ ఖుష్బూ సీరియస్
Kushboo Family
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 16, 2023 | 6:17 PM

Share

సోషల్‌ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా తారలు వీటి కారణంగా తరచూ ట్రోలింగ్‌కు గురువుతున్నారు. కొందరు వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే మరికొందరు మాత్రం స్ట్రాంగ్‌గా కౌంటర్లిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఈ నెటిజన్ల ట్రోలింగ్‌ శ్రుతిమించిపోతోంది. కొందరు సినిమా తారల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్‌ నటి ఖుష్బూ ఫ్యామిలీ ఈ బాడీ షేమింగ్‌ బారిన పడ్డారు. ఆమె కూతుళ్లపై కొందరు నెటిజన్లు అభ్యంతకర కామెంట్లు చేశారు. దీనిపై ఖుష్బూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిల్లలైనా వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఖుష్భూ తన ట్విటర్‌ ఖాతాలో తన ఇద్దరు కూతుర్లు అవంతిక, ఆనందిలతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. చాలామంది ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపించారు. క్యూట్‌ ఫిక్‌ అంటూ ప్రశంసించారు. అదే సమయంలో ఒక ఆకతాయి ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై ఖుష్బూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ’20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్‌ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ట్విట్టర్‌ వేదికగా వాపోయారు ఖుష్బూ.

కాగా ప్రస్తుతం ఖుష్బూ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఖుష్భూకు మద్దతుగా నిలుస్తున్నారు. కామెంట్లు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖుష్బు కూతుళ్లపై ట్రోలింగ్‌ జరగడం ఇది తొలి సారి కాదు. గతంలోనూ వారి బరువు, శరీరాకృతిపై కొందరు అసభ్యకర కామెంట్లు చేశారు. అలా జరిగిన ప్రతిసారీ తనదైన శైలిలో కౌంటర్‌ ఇస్తున్నారు ఖుష్బూ. తాజాగా మరోసారి తన పిల్లల గురించి అభ్యంతకర కామెంట్లు చేయడంతో ఘాటుగా రియాక్టయ్యారామె.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!