- Telugu News Photo Gallery Cricket photos Hardik Pandya marriage with Natasha Stankovic again with Hindu traditions in Udaipur photos
హిందూ సంప్రదాయంలో.. వేద మంత్రాల సాక్షిగా.. ముచ్చటగా మూడోసారి నటాషాను మనువాడిన హార్దిక్.. ఫొటోలు చూశారా?
టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది.
Updated on: Feb 17, 2023 | 3:16 PM

టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది.

కాగా మూడేళ్ల క్రితమే పాండ్యా- నటాషా వివాహం జరిగింది. కరోనాతో పాటు అప్పటి పరిస్థితులను బట్టి ఈ జంట సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం వీరికి ఓ కుమారుడు అగస్త్య జన్మించాడు.

వాలెంటైన్స్ డే సందర్భంగా 2023 ఫిబ్రవరి 14న ఈ జంట క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మరోసారి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి మళ్లీ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సందడి చేశారు.

ఈ సందర్భంగా ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు. అనంతరం హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు.

గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు హార్దిక్- నటాషా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




