AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల హార్ట్‌త్రోబ్‌.. మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్‌ ట్యాగ్‌.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో ఎంతో క్యూట్‌గా ఉన్నది కూడా ఓ మలయాళీ ముద్దుగుమ్మనే. తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ.. స్టార్‌ హీరోయిన్లకు మించిన క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందం, అభినయంలోనూ మంచి మార్కులు తెచ్చుకుంది.

ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల హార్ట్‌త్రోబ్‌.. మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్‌ ట్యాగ్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Actress
Basha Shek
|

Updated on: Feb 17, 2023 | 4:30 PM

Share

టాలీవుడ్‌లో మలయాళ భామల సందడి మాములుగా లేదు. సాయి పల్లవి, కీర్తిసురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, నిత్యామేనన్‌, అను ఇమాన్యుయెల్, మంజిమా మోహన్‌, మడోన్నా సెబాస్టియన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. పై ఫొటోలో ఎంతో క్యూట్‌గా ఉన్నది కూడా ఓ మలయాళీ ముద్దుగుమ్మనే. తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ.. స్టార్‌ హీరోయిన్లకు మించిన క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందం, అభినయంలోనూ మంచి మార్కులు తెచ్చుకుంది. అనతికాలంలోనే కుర్రాళ్ల హార్ట్‌త్రోబ్‌గా మారిపోయింది. సోషల్‌ మీడియాలోనూ ఊహించని ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోన్న ఈ అందాల భామ మరెవరో కాదు.. ప్రస్తుతం థియేటర్లలో ధనుష్‌ ‘సార్‌’ తో కలిసి పాఠాలు చెబుతోన్న సంయుక్త మేనన్‌. తన తాజా కొత్త సినిమాకు కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చేసింది. తద్వారా టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ హిట్లను సొంతం చేసుకుంది. కాగా సార్‌ సినిమా విడుదల సందర్భంగా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంయుక్త ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. అందులోదే ఫై ఫొటో. చిన్నప్పుడు స్కూల్లో డ్యాన్స్, నాటకాల్లో సంయుక్త బాగా ఫెర్ఫార్మెన్స్ ఇస్తుండేదట. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. అందులో రానా భార్యగా అందం, అభినయంలోనూ మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ లోనూ వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటించింది. తాజాగా ధనుష్ నటించిన ద్వి భాషా చిత్రం ‘సార్’లోనూ టీచర్‌గా ఫుల్‌మార్క్స్ కొట్టేసింది. ఇక ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికొస్తే.. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న విరూపాక్ష సినిమాలోనూ సంయుక్తనే హీరోయిన్ గా సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం. సార్‌ సినిమా సూపర్‌ హిట్ తెచ్చుకోవడంతో మరికొన్ని క్రేజీ సినిమాల్లోనూ ఈ మలయాళీ ముద్దుగుమ్మ కనిపించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..