AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 21, 2026): మేష రాశి వారికి ఆర్థికపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 21 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 21, 2026): మేష రాశి వారికి ఆర్థికపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మేష మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థికపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు ప్రవేశపెట్టి లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువులు, పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్య మైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతం నుంచి అనుకోకుండా ఒక శుభ వార్త అందుతుంది. కుటుంబ ‍సభ్యుల నుంచి ఆశించిన సుఖ సంతోషాలు లభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి కానీ, అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు ఎప్పటి మాదిరిగానే సాగిపోతాయి. ప్రముఖులతో స్నేహాలు పెరుగుతాయి. మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బాగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, బాధ్యతలు చేపడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

పనితీరుతో అధికారులను, సహోద్యోగులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల కారణంగా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లి తండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు లాభిస్తాయి. సొంత ఊర్లో ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరగడం జరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి బాగా లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధార పడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు కూడా బాగా లాభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలుంటాయి.

Follow Us