Pawan Kalyan: పవన్ అభిమాని చిన్నారి రేవతి మృతి.. శోకసంద్రంలో పవర్ స్టార్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒక చిన్నారి కోరికను తీర్చారు. దాదాపు నాలుగేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ చిన్నారి రేవతిని కలుసుకున్నారు.
మన స్టార్ హీరోలు సినిమాలతో సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగే తమ అభిమానులు అనారోగ్యాలకు గురయ్యారని తెలుసుకొని వారిని కలిసి వారికి మెరుగైన ఆరోగ్యం అందించేందుకు సాయం చేస్తుంటారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒక చిన్నారి కోరికను తీర్చారు. దాదాపు నాలుగేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ చిన్నారి రేవతిని కలుసుకున్నారు. ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని పవన్ చాలించి పోయాడు. ఆ చిన్నారి ఇప్పుడు కన్నుమూసింది. మైసూర్ లో చికిత్స తీసుకుంటూ రేవతి మరణించిందని తెలుస్తోంది. రేవతి మరణ వార్త తెలిసి పవన్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అభిమాని అయిన రేవతి.. ఆయనను చూడాలని ఉందని కోరడంతో పవర్ స్టార్ అభిమానులు ఆ విషయాన్నీ ఆయనకు తెలిసేలా చేశారు. విషయం తెలుసుకున్న పవన్ వెంటనే ఆ చిన్నారిని కలుసుకున్నారు.
ఆ చిన్నారిని ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ చిన్నారితో మాట్లాడారు పవన్. ఆ చిన్నారి పాట పడుతుంటే మురిసిపోయారు పవన్. ఆ పాప అమాయకంగా మీ కళ్ళకు దండం పెట్టొచ్చా అంటూ అడగ్గా అయ్యో లేదు తల్లి అంటూ ఆ పాపను ముద్దాడారు పవన్. అలా ఆ చిన్నారి కల నెరవేరింది.
ఆ చిన్నారికి వీల్ చైర్ అవసరం అని తెలుసుకొని ఆమెకు వీల్ చైర్ ను అందించారు. అలాగే ఆ కుటుంబానికి ఆర్థికంగానూ సాయం అందించారు పవన్. అయితే ఆ చిన్నారి ఇప్పుడు కన్ను మూసిందని తెలుస్తోంది. పాప చనిపోయిందని తెలిసి పవన్ అభిమానులు ఆ చిన్నారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలుపుతున్నారు.