- Telugu News Photo Gallery Cinema photos Did Samantha Ruth Prabhu reject Allu Arjun's offer for Pushpa 2; Know the truth here
Samantha: పుష్ప-2లో స్పెషల్ సాంగ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత..? అసలు విషయం ఇదే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. .
Updated on: Feb 17, 2023 | 3:20 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

పుష్ప మువీలో సమంత ఐటం సాంగ్ 'ఊ అంటావా మావ ఉఊ.. అంటావా మావా' అభిమానులను ఓ ఊపు ఊపేసిందంటే అతిశయోక్తికాదు.

పుష్ప సినిమా సీక్వెల్‌గా పుష్ప-2లోనూ సమంతతో ఓ ఐటం సాంగ్ కోసం చిత్రబృందం సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

నిజానికి పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించనేలేదని సామ్ సన్నిహితులు తెలిపారు.

ఇక ప్రస్తుతం సామ్ కథానాయికగా నటించిన.. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో శాకుంతలం మువీని ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.





























