- Telugu News Photo Gallery Cinema photos Dhanush's Sir movie Makers Plans to Screen a few free shows to students and teachers of government schools across telugu states telugu cinema news
Sir Movie: కార్పోరేట్ స్కూళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న ‘సార్’.. సినిమాకు సాలిడ్ టాక్..
Rajitha Chanti | Edited By: Rajeev Rayala
Updated on: Feb 17, 2023 | 5:02 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటేస్ట్ చిత్రం సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు (ఫిబ్రవరి 17న) తెలుగుతోపాటు.. తమిళంలో విడుదలైంది. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.

విడుదలకు ముందే ప్రీమియర్స్ షోలతో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఇక తాజాగా ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం సార్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ టీచర్స్, స్టూడెంట్స్ కోసం కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ షోస్ వేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తర్వలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

తొలిసారిగా తెలుగులో ధనుష్ నటించిన ఈ సార్ చిత్రం.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా అని తెలుస్తోంది.

కార్పోరేట్ స్కూళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న 'సార్'.. సినిమాకు సాలిడ్ టాక్..





























