Saranya Mohan: భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే అవాక్ అవుతారు
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడి పేరు శరణ్య మోహన్. ఈ బ్యూటీ తమిళ్, మలయాళ సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది.
కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతూ ఉంటారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన హీరోయిన్స్ లో పై ఫొటోలో కనిపిస్తున్న భామ కూడా ఒకరు. నాని నటించిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమా గుర్తుందా.. అంత సులభంగా మర్చిపోలేం ఆ సినిమాను.. ముఖ్యంగా నాని నటన సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. నాని నటనతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడి పేరు శరణ్య మోహన్. ఈ బ్యూటీ తమిళ్, మలయాళ సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా 2008లో ధనుష్ – నయనతార నటించిన యారది నీ మోహిని అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో తొలిసారిగా విలేజిలోవినాయకుడు సినిమాలో నటించింది. అలాగే చివరిగా తెలుగులో హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో నటించింది.
అయితే ఈ భామ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే శరణ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఎలా ఉన్నారు అని అంతా ఆసక్తిగా గూగుల్ ను గాలించేస్తున్నారు. ఇంతకు శరణ్య ఇప్పుడు ఎలా ఉన్నారంటే.. 2014 తర్వాత శరణ్య సినిమాలకు గుడ్ బై చెప్పారు.
శరణ్య తన చిరకాల ప్రియుడు డాక్టర్ అరవింద్ కృష్ణన్‌ను 6 సెప్టెంబర్ 2015న వివాహం చేసుకుంది. వీరికి అనంతపద్మనాభన్ అరవింద్ అనే కుమారుడు, అన్నపూర్ణ అరవింద్ అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది శరణ్య. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మ్మాడు ఎలా ఉందో మీరే చూడండి.
View this post on Instagram