అభిమానిని ఇంటికి ఆహ్వానించి అదిరిపోయే ఆతిథ్యమందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. కన్నీళ్లు పెట్టుకున్న అనకాపల్లి యువకుడు

అన్నీ కలిసొచ్చి ఆ అభిమాన హీరోనే కలవాలని ఆహ్వానం అందిస్తే.. స్వయంగా పిలిచి ఆతిథ్యమిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆ మధుర క్షణాన మాటలు రావు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా గవరపాలెంకు చెందిన మెగా ఫ్యాన్‌ విజయ్‌.

అభిమానిని ఇంటికి ఆహ్వానించి అదిరిపోయే ఆతిథ్యమందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. కన్నీళ్లు పెట్టుకున్న అనకాపల్లి యువకుడు
Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2023 | 5:29 PM

తమ అభిమాన హీరోలను కలవాలని, వారితో ఫొటోలు దిగాలని చాలామందికి ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు. చాలామంది అభిమానులకు తాము దేవుడిలా ఆరాధించే హీరోలను కలవాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ అన్నీ కలిసొచ్చి ఆ అభిమాన హీరోనే కలవాలని ఆహ్వానం అందిస్తే.. స్వయంగా పిలిచి ఆతిథ్యమిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆ మధుర క్షణాన మాటలు రావు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా గవరపాలెంకు చెందిన మెగా ఫ్యాన్‌ విజయ్‌. వివరాల్లోకి వెళితే.. చిన్నతనం నుంచి విజయ్‌కు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌ మాస్టర్‌గా పలు టీవీ షోల్లోనూ కనిపించాడు. న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కాగా ఓ డ్యాన్సింగ్‌ కాంపిటీషన్‌లో విజయ్‌ బృందం ఫస్ట్‌ ప్రైజ్‌ దక్కించుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. అయితే ఆ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో చిరంజీవి హాజరుకాలేదు. దీంతో అభిమాన హీరోలను కలవాలన్న విజయ్ కోరిక తీరలేదు. ఆ తర్వాత తన భార్య జ్యోతితో కలిసి చైనాలో 12 ఏళ్ల పాటు స్థిరపడ్డారు. ఇద్దరూ యోగాసనాలు వేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

నా జీవితంలో అత్యంత మధుర క్షణాలివే..

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మెగాస్టార్‌ను కలవలేదన్న లోటు విజయ్‌ దంపతులకు అలాగే ఉండిపోయింది. అయితే ఇటీవల ఈ దంపతులు హైదరాబాద్‌కు వచ్చారు. పలు టీవీ ఛానెల్స్‌ ఇంటర్వ్యూల్లో చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లింది. వచ్చి కలవాలని కబురు పంపారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే విజయ్‌ దంపతులు చైనా తిరిగి వెళ్లిపోయారు. మరోసారి ఇండియా వచ్చినప్పుడు తప్పక కలవాలని చిరంజీవి వారికి సమాచారమందించారు. మరి అభిమాన హీరోనే ఆహ్వానం పంపితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? వెంటనే భార్యపిల్లలతో కలిసి హైదరాబాద్‌లో వాలిపోయారు. మెగాస్టార్‌ ఇంటికి వెళ్లి ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ‘నేను గిన్నిస్‌ రికార్డు సాధించినప్పుడు కూడా ఇంత ఆనందించలేదు. నా అభిమాన హీరో ఇంట్లో ఉండటం.. ఆయన చేతులు మీదగా ఆతిథ్యం స్వీకరిస్తానని కలలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి గారు మా పిల్లలను దగ్గరకు తీసుకుని ఆడించారు. ఈ జన్మకు ఇది చాలు’ అని ఎమోషనల్‌ అయ్యాడు విజయ్‌. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అభిమానిని ఇంటికి ఆహ్వానించి.. అతిథి మర్యాదలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి సింప్లిసీటీ, సంస్కారంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Chiranjeevi 1

Chiranjeevi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?