Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య సినిమాల్లో అవకాశం వచ్చినా ఈ స్టార్ హీరోయిన్ నటించలేదట !!

ఇంతకు ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసుగా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పటికీ పోటీ పడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు

Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య సినిమాల్లో అవకాశం వచ్చినా ఈ స్టార్ హీరోయిన్ నటించలేదట !!
Chiranjeevi, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2023 | 5:14 PM

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తే నటించను అని ఈ హీరోయిన్ చెప్తుంది.. అసలు స్టార్ హీరోల సినిమాల్లోఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్స్.. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇంతకు ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసుగా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పటికీ పోటీ పడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తమ సినిమాలతో గట్టి పోటీ ఇస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతి బరిలోకి దూకి ఇద్దరూ సూపర్ హిట్స్ అందుకున్నారు. వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ, వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ లు అందుకున్నారు.

అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా వదులుకుందట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె సీనియర్ నటి గౌతమి. ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

గౌతమి నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేసింది. కానీ చిరు, బాలయ్యతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీని పై స్పందిస్తూ.. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ.. అప్పుడు నేను బిజీ ఆర్టిస్ట్ అవ్వడంతో డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. చీర నజీవి గారితో మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ అవకాశాలను వదులుకున్నా అని తెలిపారు గౌతమి.Actress GautamiActress Gautami