AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయిన చిరంజీవి.. ఏమన్నారంటే?

హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతో నచ్చేసిందంటూ కితాబు ఇచ్చారు.

Chiranjeevi: రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయిన చిరంజీవి.. ఏమన్నారంటే?
Chiranjeevi, James Cameron,
Basha Shek
|

Updated on: Feb 18, 2023 | 9:42 AM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. ఈ సినిమాలో చెర్ర పోషించిన సీతారామరాజు పాత్రకు మంచి పేరొచ్చింది. హాలీవుడ్‌ ప్రముఖులు సైతం రామ్‌చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతో నచ్చేసిందంటూ కితాబు ఇచ్చారు. ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని, ఒక్కసారి అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. అక్కడే దర్శకుడు విజయం సాధించాడని అన్నారు. ఇదే విషయాన్ని రాజమౌళికి స్వయంగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలో చెర్రీ నటన హాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ స్పందించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా జేమ్స్‌ కామెరూన్‌ మాటలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకున్న చిరంజీవి.. ‘జేమ్స్ కామెరాన్ సర్… మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు చిరంజీవి. కాగా పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూ చిరంజీవి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కాగ ఆస్కార్ విజేతల ప్రకటనకు సమయం ముంచుకొస్తుంది. మార్చి12న జరిగే ఈ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఆస్కార్‌ను ముద్దాడాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..