AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Secrets: వామ్మో ముక్కు ఆకారం మీ తలరాతను మార్చేయగలదా?.. ఇలాంటి ముక్కు ఉంటే సంపద మాగ్నెట్లా అతుక్కుంటుందట!

ముక్కు.. ముఖంలో అతి ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, మీ ఆత్మగౌరవానికి మరియు సామాజిక హోదాకు అది ఒక నిదర్శనం. చైనీస్ ముఖ జ్యోతిష్యం ప్రకారం, ఒక వ్యక్తి ముక్కు ఆకారాన్ని బట్టి వారు ఎంత సంపాదిస్తారు? వారి వ్యక్తిత్వం ఎలాంటిది? అనేది ఇట్టే చెప్పేయొచ్చు. రేణుక గోడుగు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో.. మీ ముక్కు మీ భవిష్యత్తు గురించి చెబుతున్న ఆ ఆసక్తికర రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం..

Astrology Secrets: వామ్మో ముక్కు ఆకారం మీ తలరాతను మార్చేయగలదా?.. ఇలాంటి ముక్కు ఉంటే సంపద మాగ్నెట్లా అతుక్కుంటుందట!
Nose Shape And Personality Traits
Bhavani
|

Updated on: Mar 17, 2026 | 4:37 PM

Share

కళ్లు హోదాకు ప్రతీక అయితే, ముక్కు సంపదకు చిహ్నం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చిలుక ముక్కు ఉన్నవారు స్వార్థపరులా లేక ధైర్యవంతులా? పొడవాటి ముక్కు ఉన్నవారి నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? ముక్కు రంగు మారడం వల్ల కలిగే అరిష్టాలు ఏంటి? 2026 నూతన విశ్లేషణల ప్రకారం మీ ముక్కు ఆకారం మీ తలరాతను ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం..

1. చిలుక ముక్కు :

మీ ముక్కు పక్షి ముక్కులా వంగి ఉంటే, మీరు చాలా ధైర్యవంతులు. ఎవరికీ భయపడకుండా మీ అభిప్రాయాలను చెబుతారు. జనంలో ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. అయితే, కొందరు మిమ్మల్ని స్వార్థపరులుగా భావించే ప్రమాదం ఉంది.

2. పొడవాటి ముక్కు :

పెద్ద ముక్కు ఉన్నవారు స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. డబ్బు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు కానీ పొదుపు చేయడం వీరికి కొంచెం కష్టమే!

3. బటన్ ముక్కు :

చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముక్కు ఉన్నవారు చాలా దయగలవారు. ఎక్కడున్నా ప్రశాంతతను కోరుకుంటారు. పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే, చిన్న ముక్కు ఉండటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తోంది.

4. నుబియన్ ముక్కు :

విశాలమైన బేస్ పెద్ద నాసికా రంధ్రాలు ఉన్నవారు గొప్ప నాయకులుగా ఎదుగుతారు. వీరు మాటకారులు. ఎంత సంపద, కీర్తి సంపాదించినా చాలా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు.

ముక్కు రంగు – అదిరిపోయే నిజాలు:

పసుపు రంగు: ముక్కు పసుపు రంగులో ఉంటే అది అపారమైన సంపదకు అదృష్టానికి సంకేతం.

ఎరుపు రంగు: ముక్కు ఎర్రగా ఉంటే ఆర్థిక నష్టాలు మరియు వివాదాలు తప్పవు.

నలుపు/బూడిద రంగు: ముక్కు కొన నల్లగా ఉంటే భారీ ఆర్థిక విపత్తులు రాబోతున్నాయని అర్థం.

పాలిపోయిన ముక్కు: ఇది కాలేయ వ్యాధికి సంపాదించిన డబ్బు కోల్పోవడానికి సంకేతం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ విషయాలు ఇంటర్నెట్ సమాచారం ప్రజల విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి.

Follow Us