AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!

వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిల రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మద్యం మత్తులో విన్యాసాలు చేస్తున్న పోకిరీలకు హితబోధ చేసిన పాపానికి వాహనదారులను వెంబడించి విచక్షణారహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టి బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
Drunk Youth Indiscriminately Attack
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 17, 2026 | 3:31 PM

Share

వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిల రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మద్యం మత్తులో విన్యాసాలు చేస్తున్న పోకిరీలకు హితబోధ చేసిన పాపానికి వాహనదారులను వెంబడించి విచక్షణారహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టి బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సీసీ కెమెరాలలో రికార్డయిన దాడి దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ దాడి ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాకరాశికుంట ప్రాంతంలో జరిగింది. ఆ మార్గంలో కొందరు పోకిరీలు మద్యం మత్తులో బైక్ పై స్టంట్స్ చేస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనదారులు అక్కడ ఆగి వారిని మందలించారు. రోడ్డుపై వారు చేస్తున్న విన్యాసాలు తప్పని ఆ పోకిరీలకు హితబోధ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన చిల్లరగాళ్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. ఆ వాహనదారులను వెంబడించి, నడిరోడ్డుపై వాళ్ళ బైక్ ఆపి విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపైనే పిడిగుద్దులతో దాడి చేసిన ఆకతాయిలు బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు.

మత్తుకు బానిసలుగా మారిన పోకిరీలు ఈ మార్గంలో నిత్యం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోకిరిలో ఆకు రౌడీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. గంజాయి మత్తులో స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పోకిరీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us