ఐడియా అదుర్స్ కదూ..! బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు వేయకుండా ఏం చేశారో తెలుసా..?
ఖాళీ గోడలు కనపడితే చాలు వాల్ పోస్టర్లు, రాజకీయ నేతల వాల్ రైటింగ్స్, వ్యాపార సంస్థల రాతలతో ఊదరగొడుతుంటారు. వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లకు చెక్ పెట్టేందుకు జనగామ మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం జనంలో చర్చగా మారింది. పూలతో చేపట్టిన వినూత్న ప్రయత్నం చూసి ప్రతిఒక్కరూ ఐడియా అదుర్స్ అంటున్నారు. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

ఖాళీ గోడలు కనపడితే చాలు వాల్ పోస్టర్లు, రాజకీయ నేతల వాల్ రైటింగ్స్, వ్యాపార సంస్థల రాతలతో ఊదరగొడుతుంటారు. వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లకు చెక్ పెట్టేందుకు జనగామ మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం జనంలో చర్చగా మారింది. పూలతో చేపట్టిన వినూత్న ప్రయత్నం చూసి ప్రతిఒక్కరూ ఐడియా అదుర్స్ అంటున్నారు. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?
జనగామ పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో గోడలపై ఇష్టారాజ్యంగా వాల్ పోస్టర్లు వేయకుండా, వాల్ రైటింగ్స్ రాయకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు కనువిప్పు కలిగేలా డిఫరెంట్ ప్రయత్నం చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడే ప్రతి ఒక్కరూ జనగామ మున్సిపాలిటీలో చేపట్టిన ఈ ప్రయత్నం చూస్తే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే.. ప్రభుత్వ కార్యాలయాల గోడలు, పబ్లిక్ ప్రాంతాలలో వాల్ రైటింగ్స్, పోస్టర్లు వేసేవారికి ఇది ఊహించని షాక్.. విచ్చలవిడిగా వాల్ రైటింగ్స్ తో పట్టణమంతా నింపేస్తున్న వారికి ఈ నిర్ణయం జ్ఞానోదయం కలిగేలా చేస్తుంది
జనగామ మున్సిపాలిటీలో అధికారులు గాంధేయ మార్గమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్రిడ్జిల వద్ద గోడలకు పూల మొక్కల కుండీలు ఏర్పాటు చేస్తున్నారు. మొదట జనగామ – సిద్దిపేట రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జిపైన ఇరువైపులా ఉన్న గోడలను నూతనంగా రంగులతో తీర్చిదిద్ది వివిధ రకాల పూల మొక్కలు కలిగిన కుండీలను అమర్చారు.
నిత్యం వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్‌తో అందహీనంగా కనిపించే గోడలు ఇప్పుడు కనువిందుగా కనిపించేలా చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, పాదాచారులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకొని అమలుపరుస్తున్న మున్సిపల్ శాఖ అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక కార్యక్రమం చేపట్టిన విధానాన్ని చూస్తే ఇప్పటివరకు అడ్డదిడ్డంగా వాల్ పోస్టర్స్, వాల్ రేటింగ్స్ ప్రదర్శించిన, వ్రాయించినవారు తమ మనసు మార్చుకొని ఇకనుండి వాల్ పోస్టర్స్, వాల్ రైటింగ్స్ వ్రాయకుండా ఉండేందుకు వెనకడుగు వేస్తారేమోనని ఆశిద్దాం..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
