AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన నిర్మాత కేదార్‌కు రోహిత్ రెడ్డి అన్ని లక్షలు ఎందుకు పంపారు..?

పైలెట్ రోహిత్ రెడ్డి మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపించిన ఈ కేసులో… తాజాగా గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో మరణించిన సినీ నిర్మాత కేదార్ పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

చనిపోయిన నిర్మాత కేదార్‌కు రోహిత్ రెడ్డి అన్ని లక్షలు ఎందుకు పంపారు..?
Kedar Rohith Reddy
Vijay Saatha
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 7:47 PM

Share

మాజీ పైలెట్ రోహిత్ రెడ్డిఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపించిన ఈ కేసులో.. తాజాగా మరో కొత్త పేరు బయటపడింది. గత ఏడాది డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో దుబాయ్‌లో మరణించిన సినీ నిర్మాత కేదార్ పేరు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. దర్యాప్తులో భాగంగా బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT).. రోహిత్ రెడ్డి వర్గాలకు కేదార్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. ముఖ్యంగా ఒకేసారి రూ.20 లక్షలు రితీష్ రెడ్డి ఖాతా నుంచి కేదార్‌కు బదిలీ అయినట్టు ఆధారాలు లభించాయి. కేదార్‌తో పాటు బేబీలాన్ పబ్‌కు చెందిన అర్జున్, కౌశిక్ రవిలతో కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

పార్టీల వెనుక పెద్ద నెట్‌వర్క్?

ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారు కేవలం 11 మందే అయినప్పటికీ.. విచారణలో మొత్తం 25కి పైగా పేర్లు బయటపడటం కేసు తీవ్రతను పెంచింది. వీరిలో డ్రగ్ సప్లయర్లు, విదేశీ లింకులు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో జరిగిన పార్టీలకు కూడా కేదార్ హాజరైనట్టు అనుమానం వ్యక్తమవుతోంది.

SIT విచారణలో కీలకమైన టైమ్‌లైన్ బయటపడింది. మార్చ్ 13న ఢిల్లీ నుంచి వచ్చిన నమిత్ శర్మను స్వయంగా రోహిత్ రెడ్డి, కౌశిక్ రవి రిసీవ్ చేసుకున్నారు అక్కడి నుంచి మ్యారియట్ హోటల్ .. బేబీలాన్ పబ్.. ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఫామ్ హౌస్‌లో మద్యం, పార్టీలతో పాటు మహిళలను కూడా తీసుకువచ్చినట్టు సమాచారం. మార్చ్ 14 తెల్లవారుజామున వరకు పార్టీ కొనసాగింది. ఆ రోజు సాయంత్రం మళ్లీ ఫామ్ హౌస్‌లో గెట్‌టుగెదర్ ఏర్పాటు చేసినట్టు SIT గుర్తించింది. వాట్సాప్ కాల్స్ ద్వారా పలువురిని ఆహ్వానించగా.. డ్రగ్స్ అవసరం ఉందని కౌశిక్ రవి కోరడంతో MDMA డ్రగ్స్ తెప్పించినట్టు దర్యాప్తులో తేలింది. పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేయగా.. మత్తులో ఉన్న నమిత్ శర్మ కాల్పులకు దిగినట్టు సమాచారం. 2024 సెప్టెంబర్ నుంచి మార్చ్ 14 వరకు కనీసం 8 సార్లు ఫామ్ హౌస్‌లో డ్రగ్ పార్టీలు జరిగినట్టు SIT అనుమానిస్తోంది. ఈ పార్టీలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సప్లయర్లు ఎవరు? అన్న దానిపై లోతైన విచారణ కొనసాగుతోంది.

2023 ఎన్నికల తర్వాత అతనికి డ్రగ్స్ అలవాటు పెరిగిందని SIT భావిస్తోంది. అదే సమయంలో తరచూ దుబాయ్ పర్యటనలు, అక్కడ వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రారంభించినట్టు గుర్తించారు. 5 నెలల్లో దాదాపు 10 సార్లు దుబాయ్ ట్రిప్స్, 4BHK పెంట్‌హౌస్‌లో నివాసం, 28 అంతస్తుల కమర్షియల్ ప్రాజెక్ట్ ప్లాన్, బుర్జ్ ఖలీఫాలో పార్టీలు నిర్వహించినట్టు సమాచారం. అదే కాకుండా యూకే, అమెరికా, ఆఫ్రికా (జాంబియా) దేశాల్లోనూ వ్యాపార లావాదేవీలు విస్తరించేందుకు ప్రయత్నాలు చేసినట్టు SIT గుర్తించింది.

కేదార్ పాత్ర ఏమిటి? డ్రగ్ సప్లై నెట్‌వర్క్ ఎంత పెద్దది? విదేశీ లింకులు ఎంత వరకు ఉన్నాయ్? ఈ కేసులో ఇంకెంత మంది ప్రముఖుల పేర్లు బయటపడతాయి? అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఒక్క డ్రగ్స్ కేసుతో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు భారీ ఆర్థిక, అంతర్జాతీయ లింకులతో కూడిన నెట్‌వర్క్‌గా మారుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉన్న ఫైనాన్షియల్ డీలింగ్స్, డ్రగ్ కనెక్షన్లు, విదేశీ పెట్టుబడులపై SIT లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇంకా ఎంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us