AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే విద్యార్థులూ ఇలా చేయండి

AP POLYCET 2026 Counselling Registration: పాలీసెట్‌ 2026 కౌన్సెలింగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ర్యాంక్‌, కేటగిరీ, ఎంపిక చేసిన కాలేజీలు, బ్రాంచీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంతో పాటు కేటాయించిన కాలేజీలో చేరిక ప్రక్రియను పూర్తి చేయాలి..

AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే విద్యార్థులూ ఇలా చేయండి
AP POLYCET Counselling
Srilakshmi C
|

Updated on: Jun 25, 2026 | 8:14 AM

Share

అమరావతి, జూన్‌ 25: ఏపీ పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థుల కోసం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 24 నుంచి జూలై 4 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ముందుగా అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Online Certificate Verification & Fee Payment ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హాల్‌టికెట్ నంబర్, ర్యాంక్, ఆధార్ వివరాలను నమోదు చేసి ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250గా ఫీజును నిర్ణయించారు.

ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులు నేరుగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు వెళ్లవచ్చు. సర్టిఫికెట్లలో మార్పులు అవసరమైన వారు లేదా వెరిఫికేషన్ పూర్తి కాని వారు సమీప హెల్ప్‌లైన్ సెంటర్లలో అసలు ధ్రువపత్రాలతో హాజరై వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచీలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థుల ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ, ఎంపిక చేసిన ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీటు కేటాయింపు అనంతరం అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీటు పొందిన అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అనంతరం కేటాయించిన కాలేజీలో ప్రత్యక్షంగా హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

సందేహాలకు హెల్ప్‌లైన్

కౌన్సెలింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు లేదా ఇతర సందేహాలు ఎదురైన అభ్యర్థులు సమీప హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చు. మొబైల్ నంబర్ మార్పు, వ్యక్తిగత వివరాల సవరణ వంటి అవసరాల కోసం chepolycet@gmail.com కు ఈమెయిల్ పంపవచ్చు. అలాగే 7842075469, 7842085469, 7842095469 హెల్ప్‌లైన్ నంబర్లకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం, షెడ్యూల్, మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పరిశీలించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • జూన్‌ 24 నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
  • జూన్‌ 24 నుంచి 30 సర్టిఫికెట్ల అప్‌లోడ్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపులు
  • జూన్‌ 25 నుంచి జులై 1వరకూ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
  • జూన్‌ 29 నుంచి జులై 3 వరకూ వెబ్‌సైట్‌లో ఐచ్ఛికాలు
  • జులై 4న ఐచ్ఛికాలు మార్చుకోవడానికి అవకాశం

Follow Us
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు