Mahesh Babu: మరో చిన్నారి గుండెకు ప్రాణం పోసిన మహేశ్‌ .. నమ్రత చొరవతో పిల్లాడి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం

ఓవైపు సినిమాలతో అభిమానులను అలరిస్తూనే.. మరోవైపు ఆపదలో ఉన్నవారికి తనవంతు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారీ స్టార్‌ హీరో. ఇప్పటికే శ్రీమంతుడిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నాడు

Mahesh Babu: మరో చిన్నారి గుండెకు ప్రాణం పోసిన మహేశ్‌ .. నమ్రత చొరవతో పిల్లాడి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం
Mahesh, Namrata
Follow us
Basha Shek

|

Updated on: Feb 22, 2023 | 8:09 PM

తెలుగులో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మహేశ్‌బాబు. అయితే అందమైన రూపంతో పాటు అంతకన్నా మంచి మనసు ఈ టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సొంతం. ఓవైపు సినిమాలతో అభిమానులను అలరిస్తూనే.. మరోవైపు ఆపదలో ఉన్నవారికి తనవంతు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారీ స్టార్‌ హీరో. ఇప్పటికే శ్రీమంతుడిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నాడు. అలాగే గుండె జబ్బులతో బాధపడుతోన్న ఎందరో చిన్నారులకు తన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. తద్వారా పిల్లల తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. తాజాగా మరో చిన్నారి గుండెకు ప్రాణం పోశాడు మహేశ్‌. తన మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలుడికి ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. చిన్నారి గుండెకు ఊపిరి పోసిన మహేష్, నమ్రత దంపతులకు ధన్యవాదాలు తెలిపాడు. మహేష్ బాబు ఫౌండేషన్ నుండి సహాయం అంది కోలుకున్న చిన్నారి ఫోటోను షేర్ చేసిన నాగవంశీ.. ‘కొన్నివారాల క్రితం నాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఓ చిన్నారికి అర్జెంట్ గా హార్ట్ సర్జరీ అవసరం ఉందని చెప్పారు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి సహాయం చేయాలని.. ఎలాగైనా ఈ విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కి చేయాలని కోరారు.

‘ ఇలాంటి నిరుపేద ఫ్యామిలీస్, పిల్లలకు సహాయం చేయడానికి మహేశ్‌- నమ్రత దంపతులిద్దరూ పాటుపడుతుంటారు. నేను వెంటనే ఈ విషయాన్నీ మహేష్ బాబు ఫౌండేషన్ కి చేరవేశాను. అలాగే నమ్రత గారిని పర్సనల్ గా కలిసి విషయం చెప్పాను. ఆ తర్వాత ఆమెకు చిన్నారి ఫ్యామిలీ పూర్తి వివరాలు పంపించాను. నమ్రత గారు వెంటనే స్పందించి.. ఆ చిన్నారికి హెల్ప్ చేయాలని ఫౌండేషన్ సిబ్బందికి సూచించారు. రెండు వారాల తర్వాత సర్జరీ జరిగిన చిన్నారి ఫ్యామిలీ నుండి ఒక మెసేజ్ వచ్చింది. మహేష్ బాబు చేసిన సహాయానికి వారు జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. సర్జరీ తర్వాత కోలుకున్న చిన్నారిని చూడడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇన్నేళ్ళైనా మహేష్ బాబు, నమ్రత ఎప్పుడు కూడా వారు సాయాన్ని బయటపెట్టలేదు. సాయం పొందినవారు చెప్పడం తప్ప. ఇలాంటి ఎన్నో వేల కుటుంబాల దీవెనలన్నీమహేష్ ఫ్యామిలీని చల్లగా ఉంచుతాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని ఎవరైనా దేవుడిగా భావిస్తారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ అలాంటి బాటలోనే నడుస్తోంది. మరోసారి మహేష్ తో పాటు నమ్రత గారికి ధన్యవాదాలు’ అని దీర్ఘకాలిక పోస్ట్‌లో రాసుకొచ్చారు నాగవంశీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాగవంశీ నిర్మాణంలోనే ఎస్‌ఎస్‌ఎంబీ 28 సినిమా చేస్తున్నాడు మహేశ్‌. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?