Jayamalini: అలనాటి స్టార్ డ్యాన్సర్ జయమాలిని ఇంట పెళ్లి సందడి..
అలనాటి న్యత్యకారిణి జ్యోతిలక్ష్మీ చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన అందచందాలతో అప్పట్లో కుర్రకారును ఓ ఊపుఊపేసింది. అనతికాలంలో తెలుగు సినీ చరిత్రలో..
అలనాటి న్యత్యకారిణి జ్యోతిలక్ష్మీ చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన అందచందాలతో అప్పట్లో కుర్రకారును ఓ ఊపుఊపేసింది. అనతికాలంలో తెలుగు సినీ చరిత్రలో అక్కాచెల్లెళ్ళైన జ్యోతిలక్ష్మీ, జయమాలినిలు హవా కొన్ని దశాబ్ధాలపాటు కొనసాగింది. అభిమానులపై వీరి ప్రభావం ఎంతగా పడిందంటే.. పిల్లలెవరికైనా జ్యోతిలక్ష్మీ, జయమాలిని పేర్లు పెట్టడానికి కూడా వెనుకాడేవారు. ప్రేక్షకులెవ్వరూ అంత తేలిగ్గా వీరిని మర్చిపోలేరు. వివాహానంతరం కూడా నటించిన జ్యోతిలక్ష్మీ, తన కుమార్తె జ్యోతి మీనాను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని మువీల్లో కూతురుతో కలిసి కూడా జ్యోతిలక్ష్మి డాన్సులు చేసింది. అలానే కొన్ని టీవీ సీరియల్స్ లోనూ జ్యోతిలక్ష్మి నటించింది. ఇలా దాదాపు 300పై చిలుకు సినిమాల్లో ఆమె నటించింది. వాటిల్లో 250 స్పెషల్ సాంగ్స్‌లో ఆమె నటించింది. 2016లో జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కుటుంబ పోషణార్థం సినిమాల్లోకి వచ్చిన జయమాలిని, కెరీర్ ప్రారంభంలో కరాటే కమల వంటి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. తర్వాత రామారావు, శోభన్ బాబు, కృష్ట.. వంటి నాటి స్టార్ హీరోలందరితోనూ ఐటమ్ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. పోలీస్ అధికారి అయిన పార్తీబన్‌తో జయమాలిని వివాహం జరిగిన తర్వాత గృహిణిగా మారింది. కాగా వీరి కుమారుడు శ్యామ్ హరికి తాజాగా వివాహం నిశ్చయమైంది. చెన్నైకి చెందిన ప్రియాంకతో ఫిబ్రవరి 23న వివాహం జరగనుంది. ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన మ్యారేజ్ రిసెప్షన్‌కు నాటి నటీనటులతోపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.