మహానుభావుడు.. ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం.. ఎంత అన్యోన్యతో..

ఏక పత్నితో వేగడమే గగనమైపోతుందని పురుషపుంగవులు తెగ ఫీలైపోతుంటారు..! ఇక రెండో ఇళ్లు పెడితే ఇక ఆ కాపురం రణరంగమే. ఐతే ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ముగ్గురు రమణులతో ఒకే ఇంట్లో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సాఫీగా కాపురం నెట్టుకొస్తున్నాడు..

మహానుభావుడు.. ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం.. ఎంత అన్యోన్యతో..
American 'trophy Husband
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2023 | 4:47 PM

ఏక పత్నితో వేగడమే గగనమైపోతుందని పురుషపుంగవులు తెగ ఫీలైపోతుంటారు..! ఇక రెండో ఇళ్లు పెడితే ఇక ఆ కాపురం రణరంగమే. ఐతే ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ముగ్గురు రమణులతో ఒకే ఇంట్లో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సాఫీగా కాపురం నెట్టుకొస్తున్నాడు. వీరి అన్యోన్యత చూస్తుంటే నెటిజన్లకు మతిపోయినంత పనౌతుంది. అమెరికాకు చెందిన నిక్‌ డెవిస్‌ 15 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ (39) అనే మహిళను తొలిసారి వివాహం చేసుకున్నాడు. అ తర్వాత తొమ్మిదేళ్లకు మొదటి భార్య అనుమతితో జెన్నీషన్ (34)ను మనువాడాడు. ఆ తర్వాత ఇద్దరు సతీమణుల సమ్మతంతో ముచ్చటగా మూడోసారి డేనియేల్‌ (22)ను పెళ్లాడాడు. ఈ ముగ్గురు పత్నిలు చక్కగా ఎవరి ఉద్యోగం వారు చేసుకుంటూ పతి దేవుడైన నిక్‌ డెవిస్‌ను పోషిస్తూ ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమైపోయివుంటుంది.. నిక్‌కు ఉద్యోగం సజ్జోగం ఏమీ చెయ్యరన్నమాట. ఇంటిపట్టున ఉంటే.. ముగ్గురు భార్యలు సంపాదించి ఇంటి అవసరాలను తీరుస్తుంటారు.

నిజానికి ఈ విధానాన్ని పాలిగమీ ఫ్యామిలీ (Polygamy) అంటారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ విధానం ఆచరణలో ఉంటుంది. అంటే ఒకే భర్త.. భార్య సమ్మతితో అనేక మంది మహిళలను వివాహం చేసుకుంటాడటన్నమాట (అలాగే ఒక మహిళ అనేక మంది భర్తలను వివాహం చేసుకోవడాన్ని పాలియాండ్రి ఫ్యామిలీ (polyandry) అంటారు) ఇక నిక్‌ డివిస్‌ కు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. గతేడాది జూన్‌లో మరో కుమార్తె జన్మించింది. ముగ్గురు భార్యలతో కలిసి జీవించడం తనకు ఎంతో ఇష్టమని.. తన కల నెరవేరిందని నిక్‌ అంటున్నాడు. పైగా.. చదరంగంలో రాజు ఉన్నప్పటికీ అతను ఎక్కువగా తిరగడు. అందుకే నేను జాబ్‌ చెయ్యడం లేదు. రాణికే ఎక్కువ అధికారాలు ఉంటాయని నిక్‌ చెప్పడం విశేషం. తన లైఫ్‌లో ఇంత ఆనందాన్ని పొందగలుగుతానని కలలో కూడా ఊహించలేదని మూడో భార్య డేనియేల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వింత కుటుంబానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.