ఒక్క రూపాయి చిల్లర లేదన్న ఆర్టీసీ బస్‌ కండక్టర్‌.. ఏకంగా రూ.15 వేలు ఫైన్‌ వేసిన కోర్టు

సాధారణంగా బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చిల్లర లేదని కండక్టర్లు బ్యాలెన్స్‌ ఇవ్వకుండా వెళ్లిపోతుంటారు. ఇది షరా మామూలేనని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే ఓ వ్యక్తి మాత్రం అలా..

ఒక్క రూపాయి చిల్లర లేదన్న ఆర్టీసీ బస్‌ కండక్టర్‌.. ఏకంగా రూ.15 వేలు ఫైన్‌ వేసిన కోర్టు
Bmtc Bus Conductor
Follow us

|

Updated on: Feb 21, 2023 | 6:27 PM

సాధారణంగా బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చిల్లర లేదని కండక్టర్లు బ్యాలెన్స్‌ ఇవ్వకుండా వెళ్లిపోతుంటారు. ఇది షరా మామూలేనని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే ఓ వ్యక్తి మాత్రం అలా ఊరుకొని వెళ్లలేదు. బస్‌ టికెట్‌ ఇచ్చి చిల్లర లేదని ఒక్క రూపాయి ఇవ్వడానికి నిరాకరించిన ఆర్టీసీ బస్‌ కండక్టర్‌పై కోర్టులో కేసు వేసి, ఏకంగా మూడేళ్ల పాటు పోరాడి తుదకు విజయం సాధించాడా వ్యక్తి. 2019లో రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపోకు బీఎమ్‌టీసీ బస్సులో ప్రయాణించాడు. ఆ సమయంలో ప్రయాణికులు రూ.30 ఇవ్వగా.. కండక్టర్ రూ.29కి టిక్కెట్ ఇచ్చాడు. తనకు ఇంకా ఒక రూపాయి రావల్సి ఉందని, ఇవ్వమని ప్రయానికుడు కోరాడు. ఐతే కండక్టర్ మాత్రం తన దగ్గర రూపాయి చిల్లర లేదని చెప్పాడు. అంతటితో ఆగకుండా సదరు ప్రయాణికుడిపై కండక్టర్ దుర్భాషలాడాడు కూడా. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ తనకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఐతే రమేష్ ఫిర్యాదును స్వీకరించకపోగా కండక్టర్‌కే సపోర్టు చేస్తూ.. సర్వీస్‌లో లోపం ఉందన్న ఆరోపణలతో పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది.

అనంతరం రమేష్‌ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కోర్టు (బీఎంటీసీ)లో అఫిడవిట్ దాఖలు చేశాడు. వాదనలు విన్న కోర్టు కండక్టర్ ఒక రూపాయితోపాటు ఫిర్యాదుదారుడు కోరిన రూ.15 వేలల్లో ప్రస్తుతం రూ.2,000 చెల్లించాలని, లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బెంగళూరు కోర్టు (బీఎంటీసీ) ఆదేశించింది. మిగిలిన మొత్తం 45 రోజుల్లో చెల్లించాలని, అలాచేయని పక్షంలో ఏడాదికి రూ.6 వేల చొప్పున వడ్డీ చెల్లించవల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో వెలువరించింది. ఈ సమస్యను లేవనెత్తడం చిన్నదిగా అనిపించినా.. అది వినియోగదారుడి హక్కు్కు సంబంధించిన అంశంగా గుర్తించాలని పేర్కొంటూ.. ఈ పని చేసినందుకు కోర్టు అతన్ని అభినందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.