- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu to resume Vijay Deverakonda's kushi movie shooting; shooting will start on March 8th
సమంత దిల్ ‘ఖుషీ’.. తిరిగి సెట్లోకి అడుగుపెడుతోన్న సామ్..
స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వరుస షూటింగ్‌లతో బిజీ అవుతోంది. విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటిస్తున్న మువీ 'ఖుషీ'..
Updated on: Feb 21, 2023 | 3:10 PM

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వరుస షూటింగ్‌లతో బిజీ అవుతోంది. విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటిస్తున్న మువీ 'ఖుషీ'.

మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ సెట్లోకి అడుగు పెట్టనున్న సమంత. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే గత ఏడాది డిసెంబరు 23న విడుదలకావల్సిన ఈ మువీ.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ మువీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా భాగాల చిత్రీకరణకు కొత్త షెడ్యూల్‌ను రూపొందించింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు.

ఫిబ్రవరి 27న విజయ్ సెట్లోకి అడుగు పెట్టనుండగా.. మార్చి 8 నుంచి సమంత రంగంలోకి దిగుతుందని సమాచారం.

దాదాపు నెలరోజుల పాటు హైదరాబాద్‌లో.. ఆ తర్వాత ఏప్రిల్‌లో కశ్మీర్లోని అలెప్పీలో షూటింగ్ పనులు జరగనున్నాయి.





























