Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Taxis Banned: నగరవాసులకు షాక్‌.. ఓలా, ఉబర్‌, ర్యాపిడో బైక్‌ ట్యాక్సీలను బ్యాన్ చేసిన సర్కార్‌!

బైక్‌ ట్యాక్సీ సేవలందిచే క్యాబ్‌ అగ్రిగేటర్లైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 20) ప్రకటించింది. ఈ మేరకు బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది..

Bike Taxis Banned: నగరవాసులకు షాక్‌.. ఓలా, ఉబర్‌, ర్యాపిడో బైక్‌ ట్యాక్సీలను బ్యాన్ చేసిన సర్కార్‌!
Bike Taxis Banned
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 21, 2023 | 3:53 PM

బైక్‌ ట్యాక్సీ సేవలందిచే క్యాబ్‌ అగ్రిగేటర్లైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 20) ప్రకటించింది. ఈ మేరకు బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. నాన్-ట్రాన్స్‌పోర్ట్ (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ మార్కులు/నంబర్‌లు ఉన్న ద్విచక్ర వాహనలను ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ ట్యాక్సీలుగా ఉపయోగించడం మోటారు వాహన చట్టం-1988ని ఉల్లంఘించడమేనని తన నోటీసులో నొక్కి చెప్పింది. బైక్ టాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే మొదటిసారైతే రూ.5,000 జరిమానా, రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు నిబంధనలు మీరితే రూ.10,000 జరిమానాతో పాటు జైలుశిక్ష ఉంటుందని హెచ్చరించింది. నేరం పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు సస్పెండ్‌ చేస్తామని పేర్కొంది, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దిల్లీ ట్రాఫిక్‌ సిబ్బంది ఇప్పటికే తనిఖీలు ప్రారంభించినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

ఓ వైపు ప్రయాణ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఓలా, ఉబర్, రాపిడో బైక్‌ సర్వీసులపై ఆధారపడే అనేక మంది వినియోగదారులపై ఈ చర్య ప్రభావం చూపనుంది. ఢిల్లీ రోడ్లపై తిరిగే బైక్‌లలో అత్యధికంగా బైక్ టాక్సీ సేవలను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో గమ్యానికి చేర్చే బైక్‌ ట్యాక్సీలకు ఢిల్లీ నగర వీధుల్లో భారీ డిమాండ్‌ ఉందనే చెప్పాలి. తాజా నిబంధనలు ప్రకారం కేవలం ఫోర్‌ వీలర్లు, ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు మాత్రమే ట్యాక్సీ సర్వీసుల కింద నడపడానికి అనుమతి ఉందని, బైకులకు అనుమతి లేదని రవాణా శాఖ పేర్కొంది. అయితే 2W, 3W, 4Wలకు సంబంధించి కొత్త అగ్రిగేటర్‌ పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే దీన్ని విడుదల చేస్తామని తెల్పుతూ ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.