- Telugu News Photo Gallery Cinema photos Rajnikanth be a part of Kantara 2; here's Rishab Shetty's Major hint
‘కాంతార-2లో రజనీకాంత్..’ రిషబ్ శెట్టి మౌనం వెనుక పరమార్థం అదేనా..?
తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్ శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారట. రిషబ్ మౌనం వహించడంతో ఈ వార్త..
Updated on: Feb 20, 2023 | 8:13 PM

దక్షిణాదిన చిన్న సినిమాగా విడుదలైన 'కాంతార' మువీ అన్ని భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి ప్రీక్వెల్‌గా 'కాంతార-2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఐతే సినిమా సీక్వెల్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్నట్లు టాక్..

తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్ శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారట. రిషబ్ మౌనం వహించడంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. అది రూమర్ అయితే రిషబ్ స్పందించే వాడని.. ఏమీ చెప్పలేదంటే ‘కాంతార2’లో రజనీ కనిపించడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి.

దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ సోషల్‌మీడియాలో 'హిట్ మువీలో సూపర్ స్టార్' అనే హ్యష్‌టాగ్ చక్కర్లు కొడుతోంది.

ఇక రజనీకాంత్ కూడా కాంతార మువీ, రిషబ్‌శెట్టి అవకాశం దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నటికిమొన్న రిషబ్‌ను తన ఇంటికి పిలిచి మరీ రజనీకాంత్ సన్మానించారు. ఇన్ని క్లూస్ వచ్చాక ఫ్యాన్స్ పక్కాగా ఫిక్సై పోయారు.





























