- Telugu News Photo Gallery Cinema photos Tabu New Photos Goes attractive in social media Telugu Actors Photos
Tabu: ఈ ఏజ్ లో కూడా సోషల్ మీడియాకు చెమటలు పట్టిస్తోన్న సీనియర్ హీరోయిన్.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తోన్న టబు..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో టబు ఒకరు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా టబుకు మంచి క్రేజ్ ఉంది.కూలీ నెంబర్ వన్ సినిమాతో పరిచయం అయిన టబు అందాలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Updated on: Feb 20, 2023 | 4:24 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో పొడుగుకాళ్ల సుందరి టబు ఒకరు. అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా టబుకు మంచి క్రేజ్ ఉంది.

విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన టబు కూలీ నేం1 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించింది.

అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాగార్జున టబు క్రేమిస్ట్రీ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది.

ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ లాంటి సినిమాలు చేసింది.

ఇక తమిళ్ లో నటించిన కాదల్ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో ప్రేమ దేశం అనే టైటిల్ తో డబ్ అయ్యి. ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

చాలా కాలం తర్వాత ఇటీవలే టబు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు. మొన్నీమధ్య అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించారు.

వయసు పెరుగుతున్నప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు టబు.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఏజ్ పెరిగిన తరగని అందంతో కుర్ర హృదలకు గాలం వేస్తుంది.

ఈ అమ్మడు తాగాజా షేర్ చేసిన ఫొటోస్ చూసి వావ్ అంటున్నారు టబు అభిమానులు.




