AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Shops Ban: మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌! మద్యం దుకాణాలు, బార్లు మూసివేతకు సర్కార్‌ హుకూం..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, బార్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 19) కీలక నిర్ణయం తీసుకుంది..

Liquor Shops Ban: మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌! మద్యం దుకాణాలు, బార్లు మూసివేతకు సర్కార్‌ హుకూం..
Liquor Shops Ban
Srilakshmi C
|

Updated on: Feb 20, 2023 | 5:45 PM

Share

సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి నిరసనలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, బార్లను మూసివేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 19) కీలక నిర్ణయం తీసుకుంది. అహటాస్‌ లేదా మద్యం దుకాణాలు, బార్‌లకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో మద్యం సేవించడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది. బీజేపీ నేత ఉమాభారతి నిరసనల నేపథ్యంలో ‘నియంత్రిత మద్యం పాలసీ (controlled liquor policy)’ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని క్యాబినెట్ ఈ విధానాన్ని ఆమోదించడం విశేషం. తాజా ఆమోదంతో రాష్ట్రంలోని అన్ని ఓపెన్-ఎయిర్ బార్‌లను మూసివేయాలనే నిర్ణయం చట్టరూపం దాల్చింది. దీంతో ఎక్కడపడితే అక్కడకాకుండా కేవలం మద్యం షాపుల్లో మాత్రమే మద్యం కొనుగోలు, విక్రయాలకు వీలు కల్పించినట్లైంది.

మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మద్యపాన స్థలాలను అనుమతించబోమన్నారు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మతపరమైన స్థలాలకు మద్యం దుకాణాల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్ల పెంచుతున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవింగ్‌ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. నర్మదా సేవా యాత్రలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 64 దుకాణాలను మూసివేసినట్లు మిశ్రా తెలిపారు. కాగా ఉమాభారతి గత కొద్ది కాలంగా మద్యం వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మద్యం విక్రయాలకు నిరసనగా.. మద్యం దుకాణాల ముందు ఆవులను కట్టేసి ‘మధుశాల మే గోశాల’ (మద్యం దుకాణాల్లో ఆవుల పెంపకం) కార్యక్రమంలో ‘పాలు తాగండి, మద్యం తాగవద్దు’ అని హితబోధ చేశారు. గతంలో ఈ షాపులపై ఉమాభారతి పేడను విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.