AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టర్కీ, సిరియాలో భారత్ సేవలు అజరామరం.. సహాయక బృందాలతో ప్రధాని మోడీ సమావేశం..

టర్కీ, సిరియా దేశాలలో సేవలందించి తిరిగి స్వదేశానికి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

PM Modi: టర్కీ, సిరియాలో భారత్ సేవలు అజరామరం.. సహాయక బృందాలతో ప్రధాని మోడీ సమావేశం..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 20, 2023 | 9:06 PM

Share

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. భారీగా ప్రాణ, ఆస్థి నష్టం కలిగింది. ఫిబ్రవరి 6 న సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకు 46వేలకు పైగా ప్రజలు మరణించగా.. లక్షలాది కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. కాగా.. భారీ భూకంపాలతో అల్లాడుతున్న టర్కీ, సిరియా దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ దోస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆహారం, అత్యవసర వైద్య పరికరాలు, పలు వస్తువులను అందించింది. అంతేకాకుండా.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, వైద్య సిబ్బందిని సైతం అక్కడికి పంపింది. అయితే, ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది. 99 మందితో కూడిన వైద్య బృందం హటేలోని ఇస్కెండరున్ లో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి.. సేవలు అందించింది. తాజాగా ఆ బృందం భారత్ కు చేరుకుంది. భారత్ నుంచి వెళ్లి వచ్చిన చివరి బృందం ఇదే.. అంతకుముందు సహాయకచర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి దేశానికి చేరుకుంది.

టర్కీ, సిరియా దేశాలలో సేవలందించి తిరిగి స్వదేశానికి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ భారత్ నిర్వహించిన సహాయక చర్యలు, చేపట్టిన కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి తెలుసుకున్నారు.

ఆర్మీ సిబ్బంది, డాగ్ స్క్యాడ్, అలాగే ఆర్మీ వైద్య సిబ్బంది అందించిన సహాయక చర్యలపై అభినందించారు. భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కొనియాడారు. టర్కీలో భారత సిబ్బంది సేవలు అజరామరమంటూ అభినందించారు.

వైద్య సిబ్బంది 30 పడకల ఫీల్డ్ ఆసుపత్రిని విజయవంతంగా ఏర్పాటు చేసి, దాదాపు 4,000 మంది రోగులకు చికిత్స చేసిందని అంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..