AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆస్పత్రికొచ్చిన మహిళకు ఎక్స్‌రే తీసిన వైద్యులు.. కనిపించింది చూడగా అవాక్!

ఆమెను తన భర్త  పెద్దాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడున్న వైద్యులు సదరు మహిళకు ఎక్స్‌రే తీసి అవాక్కయ్యారు. ఏమైందని భర్తను అడగ్గా..

Viral: ఆస్పత్రికొచ్చిన మహిళకు ఎక్స్‌రే తీసిన వైద్యులు.. కనిపించింది చూడగా అవాక్!
Viral
Ravi Kiran
|

Updated on: Feb 20, 2023 | 8:43 PM

Share

ఆమెను తన భర్త  పెద్దాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడున్న వైద్యులు సదరు మహిళకు ఎక్స్‌రే తీసి అవాక్కయ్యారు. ఏమైందని భర్తను అడగ్గా.. అతడు కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. దీంతో అనుమానమొచ్చిన డాక్టర్లు.. ఆ తర్వాత ఏం చేశారు.! ఇంతకీ వారికి అందులో ఏం కనిపించింది.? అసలేం జరిగిందో..? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన దీపక్, షీలాబాయి మూడేళ్ల కిందట ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. షీలాను అతడు ఎప్పుడూ బాగా చూసుకునేవాడు. ప్రస్తుతం ఆమె నెలన్నర గర్భవతి. అంతా బాగుందనుకునేలోపు.. దీపక్ చెడు సావాసాలకు బానిసై.. దొంగతనాలు, దోపిడీలు, అక్రమ ఆయుధాల రవాణా చేయడం మొదలుపెట్టాడు. ఇది ఆమెకు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఓ రోజు దీపక్ తన దగ్గరున్న నాటు తుపాకీ తీసుకుని ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు వెళ్తుండగా.. అతడి భార్య షీలా అడ్డుకుంది. అతడి చేతుల్లోని తుపాకీని తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యకు ఆవేశానికి లోనైన దీపక్.. తుపాకీతో షీలాను కాల్చాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు ఏమైందని అడగ్గా.. గుడికి వెళ్లినప్పుడు కర్ర గుచ్చుకుని గాయమైందని అబద్దం చెప్పాడు దీపక్. ఇక షీలాకు రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు స్థానిక వైద్యుడు.

దీంతో దీపక్ తన భార్య షీలాను పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ఆమెకు ఎక్స్‌రే తీసి అవాక్కయ్యారు. పొలం పనులు చేస్తుండగా వేటగాళ్ళు కాల్చారని దీపక్ చెప్పడంతో.. అనుమానపడిన డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే షీలా పరిస్థితి విషమించడంతో ఆమెను మెడికల్ కాలేజీకి తరలించి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. సదరు మహిళ వెన్నులో నుంచి 315 ఎంఎం బుల్లెట్ బయటకు తీశారు. అయితే కాసేపటికే షీలా మరణించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దీపక్‌ను పట్టుకుని.. అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి