Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UIDAI New Rules: యూఐడీఏఐ కీలక ఆదేశాలు.. ఇకపై ఆధార్ కార్డు పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి..

ఆధార్ కార్డుల జారీకి ఉడాయ్‌ తాజాగా కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.

UIDAI New Rules: యూఐడీఏఐ కీలక ఆదేశాలు.. ఇకపై ఆధార్ కార్డు పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి..
Uidai New Rules For Issuing Aadhaar Card
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 20, 2023 | 4:43 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్లు, ఫోన్‌ సిమ్‌కార్డులు.. ఒక్కటేంటి ఏ పని చేయాలన్నీ ఆధార్‌ తప్పనిసరైంది. అప్పుడే పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు భారత పౌరులందరికీ యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డు జారీ చేస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేకపోవడంతో వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తున్నారు. ఐదేళ్లు పూర్తైన తర్వాత చిన్నారుల ప్రత్యేకంగా బయోమెట్రిక్‌ తీసుకునే ఏర్పాట్లు చేసింది ఉడాయ్‌. ఇలా పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఆధార్‌ నంబర్‌ కేటాయించేందుకు ఉడాయ్‌ తాజాగా కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్‌ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ ఆదేశాలు జారీ చేశారు.

తాజా నిబంధనల్లో భాగంగా.. 5 ఏళ్లలోపు ఆధార్ తీసుకునేందుకు వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తు ఫారంలో పూరించవల్సి ఉంటుంది. అలాగే 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి ప్రత్యేక దరఖాస్తు ఫారం ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది. ఇక18 ఏళ్లు నిండిన వారికి మరో దరఖాస్తు ఫారం.. ఈ రకంగా మొత్తం మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను ఉడాయ్‌ (UIDAI) రిలీజ్ చేసింది. వీటిని అన్నీ భాషల్లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ(UIDAI) తెలిపింది.ఇక నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలన్నా.. లేక వాళ్ల ఆధార్ లో ఏమైనా తప్పులను కరెక్షన్ చేయాలన్నా.. తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.