Bank Holidays in March 2023: తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మార్చి నెలలో బ్యాంకులకు వరుసగా 12 రోజులపాటు సెలవులు..
ఫిబ్రవరి నెల మరో ఏడు రోజుల్లో ముగుస్తోంది. పండుగలు, వారాంత సెలవులతో కలిపి మార్చి నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వచ్చే నెలలో..
ఫిబ్రవరి నెల మరో ఏడు రోజుల్లో ముగుస్తోంది. పండుగలు, వారాంత సెలవులతో కలిపి మార్చి నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వచ్చే నెలలో బ్యాంకు పనులపై వచ్చే వినియోగదారులు, ఉద్యోగాలు, ఇతర ముఖ్యమైన పనులు ఉన్నవాళ్లు ముందుగానే తమ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే బ్యాంకు పని దినాల గురించిన సమాచారం తెలుసుకుని ఉండాలి. బ్యాంకు నియమాల ప్రకారం.. నెలలో మొదటి, మూడో శనివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారంతోపాటు ఆదివారలు సెలవులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు ప్రాంతీయ సెలవుల కారణంగా పని దినాల్లో కూడా బ్యాంకు మూసివేసే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో 5,12,19, 26 తేదీల్లో మొత్తం నాలుగు ఆదివారాలు వస్తాయి. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యాథావిథిగా కొనసాగుతూనే ఉంటాయి. బ్యాంకు కస్టమర్లు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2023లో ప్రకటించిన బ్యాంక్ సెలవుల లిస్టు ఇదే..
మార్చి 2023లో బ్యాంక్ సెలవుల వివరాలు..
- మార్చి 3 చాప్చార్ కుట్
- మార్చి 5 ఆదివారం
- మార్చి 7 హోలికా దహన్/ధులండి/డోల్ జాత్రా
- మార్చి 8 ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ రెండో రోజు
- మార్చి 9 హోలీ పండగ సందర్భంగా సెలవు
- మార్చి 11 రెండో శనివారం
- మార్చి 12 ఆదివారం
- మార్చి 19 ఆదివారం
- మార్చి 22 గుడి పడ్వా/ఉగాది పండుగ/బీహార్ దివస్/సాజిబు నొంగ్మపన్బా (చెయిరాబా)/తెలుగు నూతన సంవత్సర
- దినోత్సవం/1వ నవరాత్ర
- మార్చి 25 నాల్గవ శనివారం
- మార్చి 26 ఆదివారం
- మార్చి 30 శ్రీరామ నవమి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.