Airtel, Reliance Jio Plans: మీరు జియో, ఎయిటెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అద్భుతమైన ఆఫర్లు ఏంటో తెలుసుకోండి

టెలికం రంగంలో దూకుడు కొనసాగుతోంది. ఆయా టెలికం నెట్‌వర్క్‌లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రియలన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌..

Airtel, Reliance Jio Plans: మీరు జియో, ఎయిటెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అద్భుతమైన ఆఫర్లు ఏంటో తెలుసుకోండి
Mobile Recharge
Follow us

|

Updated on: Feb 21, 2023 | 5:14 PM

టెలికం రంగంలో దూకుడు కొనసాగుతోంది. ఆయా టెలికం నెట్‌వర్క్‌లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రియలన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి కంపెనీలు వివిధ రకాల ప్లాన్స్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్లాన్స్‌ తీసుకువస్తున్నాయి. ఈ రెండు టెలికం కంపెనీలు దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను ప్రాంరభమైన విషయం తెలిసిందే. ఈ 5జీ సేవలతో ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 4కె సినిమాను 5జీ యూజర్లు సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు. అదే 4జీ యూజర్లు అయితే డౌన్‌లోడ్‌ విషయంలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఫైళ్లు, యాప్స్ కూడా 5జీలో వేగంగా హై క్వాలిటీలో లోడవుతాయి. అందుకే మీరు కనుక 5జీ ఫోన్ ఉపయోగిస్తుంటే డైలీ డేటాకు సంబంధించిన ఆఫర్లను తెలుసుకోవడం చాలా అవసరం. రోజువారీ 2 జీబీ డేటాను ఆఫర్ చేస్తున్న ఎయిర్‌టెల్, జియో ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్‌ ప్లాన్స్‌:

  1.  ఎయిర్‌టెల్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌తో డైలీ 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు
  2. ఎయిర్‌టెల్ రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్‌లో నెల రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి
  3. ఎయిర్‌టెల్ రూ. 359 ప్రీపెయిడ్ ప్లాన్‌ నెల రోజుల కాలపరిమితితో వస్తుంది. రోజుకు 2జీబీతో పాటు అపరిమిత డేటా, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు.
  4. ఎయిర్‌టెల్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్‌తో డైలీ 2.5జీబీ, అపరిమత కాలింగ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల కాలపరిమితితో పాటు 28 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎయిర్‌టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజుకు 3జీబీ డేటాను, 28 రోజుల వ్యాలిడిటీ.
  7. ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్‌ అపరిమిత కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, 56 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.
  8. ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌ 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
  9. ఎయిర్‌టెల్ రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూడు నెలల మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలతో కూడిన ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.
  10. ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ 2.5జీబీ డైలీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూడు నెలల మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు లభిస్తుండగా, దీని వ్యాలిడిటీ 84 రోజులు.
  11. ఎయిర్‌టెల్ రూ. 2,999 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు 2జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
  12. ఎయిర్‌టెల్ రూ.3,359 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా, ఏడాది వ్యాలిడిటీతో పాటు రూ. 2,999 ప్లాన్‌‌లో లభించే అన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది.

జియో ప్లాన్స్‌:

  1. రిలయన్స్ జియో రూ. 249 ప్లాన్‌ కాలపరిమితి 23 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
  2. రిలయన్స్ జియో రూ. 299 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు జియో యాప్స్, సర్వీసుల ప్రయోజనాలు లభిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
  3. రిలయన్స్ జియో రూ. 533 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ప్రతిరోజు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, జియో యాప్స్, సర్వీసుల ప్రయోజనాలు, 56 రోజుల వ్యాలిడిటీ.
  4. రిలయన్స్ జియో రూ. 2,879 ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు డైలీ 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, జియో యాప్స్, సర్వీసులు ఉపయోగించుకోవచ్చు.
  5. రిలయన్స్ జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో డైలీ 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్, సర్వీసులు, 30 రోజుల వ్యాలిడిటీ.
  6. జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డైలీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్, సర్వీసులు ప్రయోజనాలు.
  7. జియో రూ. 2023 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్ సర్వీసుల ప్రయోజనాలతో పాటు 256 రోజుల వ్యాలిడిటీ.
  8. రియలన్స్ జియో రూ. 419 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్, సర్వీసు ప్రయోజనాలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..