- Telugu News Photo Gallery Business photos EV Tax Saving: How to save tax upto rs 1.5 lakh through electric vehicle loan
EV Tax Saving: ఎలక్ట్రిక్ వాహనం ద్వారా 1.5 లక్షల పన్ను ఆదా.. ఎలాగంటే..
ప్రభుత్వం విధించిన వివిధ ఆదాయపు పన్ను స్లాబ్‌లు, నిబంధనలు చాలా మందిని గందరగోళానికి గురిచేశాయి. కొత్త పన్ను విధానాన్ని అవలంబించాలా లేక పాత పన్ను విధానాన్ని కొనసాగించాలా అనేది..
Updated on: Feb 20, 2023 | 7:07 PM

ప్రభుత్వం విధించిన వివిధ ఆదాయపు పన్ను స్లాబ్‌లు, నిబంధనలు చాలా మందిని గందరగోళానికి గురిచేశాయి. కొత్త పన్ను విధానాన్ని అవలంబించాలా లేక పాత పన్ను విధానాన్ని కొనసాగించాలా అనేది ఇప్పటికీ కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉంది. కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబులు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఆదాయ ఉన్న వ్యక్తులకు పన్ను భారం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు వివిధ రకాల పన్ను రాయితీలు, పన్ను మినహాయింపుల గురించి తెలుసుకోవాలి.

బీమా, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ మొదలైనవి లక్షల రూపాయల పన్ను రాయితీని పొందవచ్చు. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం ద్వారా కొంత పన్ను ఆదా చేసుకోవచ్చు . సెక్షన్ 80 EEB కింద ఎలక్ట్రిక్ వాహన రుణంపై వడ్డీ చెల్లింపుపై ఒకటిన్నర లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆఫర్ ప్రకారం.. మీరు తప్పనిసరిగా ఈవీ లోన్‌ను 1 ఏప్రిల్ 2019- 31 మార్చి 2023 మధ్య పొంది ఉండాలి. అంటే పన్ను ఆదా కోసం ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి మరో నెల సమయం ఉంది. 2019-20నాటి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పన్ను మినహాయింపు పథకాన్ని ప్రకటించింది.

ఈ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాల రంగం వృద్ధికి మద్దతుగా అనేక ప్రకటనలను ప్రకటించారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన లిథియం బ్యాటరీలపై కస్టమ్ సుంకం 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గించారు. అయాన్ కణాలకు అవసరమైన లిథియం, ఇతర ఉపకరణాల దిగుమతిపై కస్టమ్ సుంకం లేదు. దీనివల్ల చాలా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం సాధ్యమవుతుంది.

ఈ రంగంలో వ్యవస్థాపకుడుగా ఉన్న సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. భారతదేశంలో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలు సరఫరా గత రెండేళ్లుగా తక్కువగా ఉంది. ఇప్పుడు స్థానికంగా సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ చర్యలు కొన్ని స్థానిక ఈవీ కాంపోనెంట్ సరఫరాదారులకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రంగానికి బడ్జెట్‌లో గ్రాంట్ 33 శాతం పెరిగింది.పెరిగింది. 1.37 లక్షల కోట్ల గ్రాంట్‌తో ఈ పరిశ్రమ వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మౌలిక సదుపాయాలపై 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం వల్ల దేశంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు ఊపందుకోవచ్చని ఆటోమొబైల్ వ్యాపారులు అభిప్రాయపడ్డారు .




