Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: రిషబ్‌శెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..  ‘నా చిన్న డ్రీమ్‌ నెరవేరింది.. ఈ అవార్డు వారిద్దరికీ అంకితం చేస్తున్నాను’

అతి చిన్న సినిమాతో ఒక్కసారిగా యావత్‌ ప్రపంచమంతా మారుమోగిన పేరు రిషబ్‌శెట్టి. కాంతార మువీ విడుదలైన అన్ని భాషల్లో హిట్‌ కొట్టడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలను దాటి గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాంపై..

Rishab Shetty: రిషబ్‌శెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..  'నా చిన్న డ్రీమ్‌ నెరవేరింది.. ఈ అవార్డు వారిద్దరికీ అంకితం చేస్తున్నాను'
Dadasaheb Phalke Award To Rishab Shetty
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 21, 2023 | 5:33 PM

అతి చిన్న సినిమాతో ఒక్కసారిగా యావత్‌ ప్రపంచమంతా మారుమోగిన పేరు రిషబ్‌శెట్టి. కాంతార మువీ విడుదలైన అన్ని భాషల్లో హిట్‌ కొట్టడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలను దాటి గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాంపై మెరిసినట్లైంది. కనీసం ఫ్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించకుండా గత ఏడాది సెప్టెంబర్‌ 30న చిత్రబృందం ఈ మువీని విడుదల చేసింది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఊహించని రీతిలో దాదాపు రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మువీకి నటుడు, దర్శకుడు, రచయితగా వ్యవహరించిన రిషబ్ శెట్టి.. సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునందుకున్నారు. కాంతారా మువీ విజయానికి కారణమైన ప్రతిఒక్కరికీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ‘నా ఈ చిన్న డ్రీమ్‌ను సాకారం చేసిన మా కాంతారా చిత్ర బృందానికి కృతజ్ఞతలు. నా లైఫ్‌కి మూలస్తంభం అయిన ప్రగతి శెట్టి (భార్య) లేకుండా ఇది అసాధ్యం’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ స్పందిస్తూ.. రిషబ్‌శెట్టికి అభినందనలు తెలిపారు. నీ హార్డ్‌వర్క్‌, అంకితభావం అద్భుతంగా ఫలించాయి. నీ డ్రీమ్‌ రన్‌ కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించానలి కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది. కాగా హోంబలే ఫిల్మ్స్‌ కాంతారా ప్రీక్వెల్‌ను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.