Nagaland Elections 2023: నాగాలాండ్‌ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నలుగురు మహిళలు!

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి 60 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎంపిక కాలేదు. నాగాలాండ్‌ చరిత్రలో ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లు ఒక్కమహిళ కూడా..

Nagaland Elections 2023: నాగాలాండ్‌ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నలుగురు మహిళలు!
Nagaland Elections 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 21, 2023 | 7:27 PM

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి 60 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎంపిక కాలేదు. నాగాలాండ్‌ చరిత్రలో ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లు ఒక్కమహిళ కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 183 మంది అభ్యర్థుల్లో కెనిజాఖో నఖ్రోతో (56), జఖ్లూ (48), థామ్సన్ (58), కహులి సేమా (30) అనే నలుగురు మహిళలు తొలిసారిగా బరిలోకి దిగారు. 1977లో మాజీ ముఖ్యమంత్రి హోకిషే సెమటోను ఓడించి రానో ఎం షైజా లోక్‌సభ సభ్యురాలిగా తొలిసారి ఎన్నికైంది. ఆ తర్వాత దాదాపు 45 ఏళ్ల తర్వాత బీజేపీ నుంచి నాగాలాండ్ తొలి మహిళా రాజ్యసభ ఎంపీగా ఎస్‌ ఫంగ్యాన్‌ కొన్యాక్‌ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. నాగాలాండ్‌లోని మహిళలు అక్షరాస్యతలో జాతీయ సగటు 64.63% కంటే 76.11% మెరుగ్గా ఉన్నారు. ప్రభుత్వ/ప్రైవేట్‌ రంగాల్లో ఆ రాష్ట్ర మహిళలు దూసుకుపోతున్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వారి ఉనికి ప్రశ్నార్ధకంగా ఉంది. నాగా సమాజం పితృస్వామ్య వ్యవస్థ లోతుగా పాతుకుపోయింది. దాని సామాజిక పద్ధతులు, ఆచార చట్రంలో ఉన్న నాగా మహిళలు చాలా అరుదుగా మాత్రమే నిర్ణయాధికార వ్యవస్థల్లోకి అడుగుపెడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

‘పురాతన కాలంలో స్త్రీలు ఇంటి వద్ద ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు నిర్వహించాలని, ఇంటి పనుల నుంచి స్వేచ్ఛనిచ్చి, గ్రామాన్ని రక్షించే బాధ్యతలు మాత్రం పురుషులకు ఇవ్వబడ్డాయి. పురుషుల్లో లింగవ్యతిరేకత లేనప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో మహిళలను భాగస్వామ్యం చేయడంలో వారు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఐతే మారుతున్న కాలం, మెరుగైన విద్యతో సమానత్వం పెరిగింది. హానికరమైన లింగ నిబంధనలు మారాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల ఉనికి, నాయకత్వం ముఖ్యం. నాగాలాండ్ మొదటి మహిళా పార్లమెంట్‌ సభ్యురాలు రానో ఎం షైజా సోదరి, మాజీ ముఖ్యమంత్రి వాముజో ఫైసావో భార్య సనో వాముజోకు నాగాలాండ్ రాజకీయాలు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో మహిళలు నిలబడి పోరాడాలి. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టలేరు. రాజకీయాలను పురుషాధిక్య రంగంగా పరిగణిస్తారు. రాష్ట్ర శాసనసభలో మహిళలు లేకపోవడం ప్రధానంగా రాజకీయ పార్టీలు, ఓటర్లు మహిళా అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఈ సారి మాత్రం నిర్ణయాధికార సంస్థల్లో మహిళల భాగస్వామ్యం అవసరమని నాగా ప్రజలు భావిస్తున్నారు. ఓటర్లు వారికి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌ఫ్లుఎన్షియల్‌ నాగా మదర్స్ అసోసియేషన్ (NMA) వ్యవస్థాపక సభ్యురాలు, రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్ సనో వాముజో అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.