Viral Video: రోడ్డుపై స్పృహ తప్పిన తల్లిని బతికించుకోవడనికి ఐదేళ్ల చిన్నారి ఆరాటం..కన్నీరు పెట్టిస్తోన్న వీడియో
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మంగళవారం (ఫిబ్రవరి 21 హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల ఏళ్ల చిన్నారి తన చిన్న చిన్న చేతులతో తల్లిని బతికించుకోవడానికి పడుతున్న యాతన..
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మంగళవారం (ఫిబ్రవరి 21 హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల ఏళ్ల చిన్నారి తన చిన్న చిన్న చేతులతో తల్లిని బతికించుకోవడానికి పడుతున్న యాతన చూపరులను కంటతడిపెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
రద్దీగా ఉన్న రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని వీల్‌చైర్‌లో నెట్టుకుంటూ ఓ ఐదేళ్ల బాలుడు రద్దీ రోడ్డుపై కాలినడకన తీసుకెళ్లడాన్ని గమనించిన ఓ జర్నలిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ తీశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి, అతని సహాయంతో చిన్నారి తల్లిని రూర్కీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందించారు. సంఘటన జరిగిన రోజున తల్లికొడుకులు భిక్షాటన చేస్తుండగా.. మహిళ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని చిన్నారి వీల్‌చైర్‌లోని తన తల్లిని పిరాన్ కలియార్‌లోని తాము నివాసం ఉంటున్న గుడిసెకు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు బాలుడు తెలిపాడు. జర్నలిస్టు మహిళను సమాయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం మూలంగా ఆమె ప్రాణాలతో బయడపడిందని, ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. బాలుడు అతికష్టం మీద తల్లిని వీల్‌చైర్‌లో తోసుకుంటూ వెళ్తున్న సమయంలో ఎంతో మంది బాటసారులు అటుగా వెళ్తున్నా ఏ ఒక్కరూ సాయం అందించేందుకు ముందుకు రాలేదని జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి పేరు అబిద్, అతని తల్లి సమా పర్విన్‌లుగా గుర్తించారు.
@TV9Bharatvarsh आज रुड़की : बेहोश मां को व्हीलचेयर पर लेकर भटक रहा था पांच साल का मासूम-पत्रकार और अधिवक्ता बने मददगार#Roorkee | #Uttarakhand pic.twitter.com/cjSciXhv26
— Joginder Singh Saharanpur (@Jogindermanani1) February 22, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.