Taraka Ratna: తారకరత్న చిన్న కర్మ.. కన్నీరుమున్నీరైన భార్య.. ఓదార్చిన కూతురు నిషిక

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మన మధ్య లేడన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన దాదాపు 23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే మృత్యువుతో పోరాటంలో ఆయన అలసిపోయారు.

Taraka Ratna: తారకరత్న చిన్న కర్మ.. కన్నీరుమున్నీరైన భార్య.. ఓదార్చిన కూతురు నిషిక
Taraka Ratna
Follow us
Basha Shek

|

Updated on: Feb 22, 2023 | 9:50 PM

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మన మధ్య లేడన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన దాదాపు 23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే మృత్యువుతో పోరాటంలో ఆయన అలసిపోయారు. సరిగ్గా మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 18)న తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈనెల 20న తారకరత్న అంత్యక్రియలు జరగ్గా తాజాగా చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. నందమూరి తారకరత్న తల్లిదండ్రులు మోహన్‌ కృష్ణ, సీత, చెల్లెలు రూప, బాలకృష్ణ ఫ్యామిలీ, గారపాటి లోకేశ్వరి, నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కల్యాణ్ రామ్ ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు చిన్న కర్మలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం తారకరత్న చిన్న కర్మలో పాల్గొన్నారు. నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, నటుడు అజయ్, దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత ఆదిశేషగిరి రావు, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు బెనర్జీ, తదితరులు హాజరై తారకరత్న చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు.

తారకరత్న చిన్నకర్మ కార్యక్రమంలో ఆయన భార్య అలేఖ్యరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నఆమె భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇదే సందర్భంలో తారకరత్న పెద్ద కుమార్తె నిషిక తల్లిని ఓదార్చింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం. కన్నీరు ఆపుకోలేకపోతున్న అలేఖ్యను ఆమె కుటుంబ సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక తారకతరత్నను కాపాడేందుకు విశ్వ విధాలా ప్రయత్నించిన బాలయ్య ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నారు. అన్నయ్య మోహనకృష్ణతో కలిసి అతిథులను ఆహ్వానించడంతో పాటు తారకరత్న కూతురు నిషికతోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతూ కనిపించారు. ముఖ్యంగా బాలయ్యకు నిషిక తన ఫోన్‌లో ఏదో చూపిస్తుండడం.. దాన్ని బాలకృష్ణ తీక్షణంగా చూస్తూ వివరాలు అడగడం ఆసక్తికరంగా అనిపించింది. కాగా తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉంటానని బాలయ్య మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మాటను నిలబెట్టుకుంటూ తన బిడ్డ చిన్న కర్మ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?