Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత మళ్లీ బైక్‌ ఎక్కిన సాయి ధరమ్‌ తేజ్‌.. పొలం గట్లపై 100 కి.మీ. స్పీడ్‌లో..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొద్ది నెలల పాటు సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరమయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'వినోదయ సిత్తం' రీమేక్‌లో నటిస్తున్నాడు

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత మళ్లీ బైక్‌ ఎక్కిన సాయి ధరమ్‌ తేజ్‌.. పొలం గట్లపై 100 కి.మీ. స్పీడ్‌లో..
Sai Dharam Tej
Follow us
Basha Shek

|

Updated on: Feb 25, 2023 | 6:25 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొద్ది నెలల పాటు సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరమయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘వినోదయ సిత్తం’ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది. అయితే యాక్సిడెంట్‌ తర్వాత కోలుకున్న సాయి మొదట ఒప్పుకున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్‌ దండు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథను అందిస్తుండగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మెగా హీరో. ఈక్రమంలో ‘విరూపాక్ష’ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ రిస్కీ సీక్వెన్స్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు మూవీ మేకర్స్‌.

సాధారణంగా ఎవరికైనా బైక్ యాక్సిడెంట్ జరిగితే తర్వాత వేగంగా వెళ్లేందుకు జంకుతారు. అయితే ‘విరూపాక్ష’ చిత్రం కోసం తేజ్‌ ఏ మాత్రం భయపడకుండా 100 కిలోమీటర్ల స్పీడ్‌తో బైక్‌ తోలాడు. అది కూడా పొలం గట్లపై. మేకర్స్‌ డూప్‌ పెడతానన్నా పట్టించుకోకుండా తనే రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సింగిల్‌ షాట్‌లో కంప్లీట్‌ చేశాడు. ఈమేరకు తేజ్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ దర్శకుడు కార్తీక్‌ దండు, సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ సైనుద్దీన్ ‘Courage Over fear’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. ‘యాక్సిడెంట్ నుంరచి కోలుకున్న తర్వాత తేజు వెంటనే షూటింగ్‌కు వచ్చేశాడు. అదే టైమ్‌లో బైక్ సీక్వెన్స్‌ చేయాల్సి ఉండగా.. ఏ మాత్రం భయం లేకుండా కంప్లీట్ చేశాడు. నిజానికి ఈ సీన్‌లో కాలువ గట్టుపై బైక్ మీద 100 కిమీ. వేగంతో వెళ్తూ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. మేము డూప్‌తో ఎలాగోలా మేనేజ్ చేస్తామని చెప్పినా.. భయాన్ని పోగొట్టుకునేందుకు తనే చేస్తానన్నాడు. అన్నట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తిచేశాడు’ అని డైరెక్టర్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!