Tarakaratna: తారకరత్నపెద్దకర్మ తేదీ ఖరారు.. దగ్గరుండి ఏర్పాట్లు చేస్తోన్న బాలకృష్ణ, విజయసాయి రెడ్డి
నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నరు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నరు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఈనెల 18న తారకరత్న కన్నుమూయడంతో తన కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవ చేయాలన్న ఆయన 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. కాగా తారకరత్న అంత్యక్రియల తర్వాత చిన్నకర్మను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నందమూరి, నారా కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తారకరత్నచిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈక్రమంలోనే నందమూరి హీరో పెద్ద కర్మ తేదీని ఫిక్స్ చేశారు. తారకరత్న తరఫున బాలకృష్ణ, భార్య అలేఖ్యా రెడ్డి తరఫున విజయసాయి రెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాట్లు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడి పెద్దకర్మ తేదీని ఖరారు చేవారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి అంత్యక్రియలు ముగిసేంత వరకూ బాలకృష్ణ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నందమూరి హీరో కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. ఇక విజయ సాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు కావడంతో తాను కూడా తారకరత్న అంత్యక్రియల్లో భాగమయ్యారు.
ఈ సందర్భంగా రాజకీయాలు పక్కన పెట్టి మరీ బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. దీంతో ఆయనపై మరింత గౌరవం పెరిగిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్య, విజయసాయిరెడ్డి కలిసి తారకరత్న పెద్ద కర్మ తేదీని నిర్ణయించారు. ఇందుకోసం ప్రింట్ చేయించిన కార్డులో బాలకృష్ణ, విజయసాయిరెడ్డిలే పెద్ద కర్మకు రావాలని బంధు, మిత్రులను ఆహ్వానించారు. ‘ నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించారన్న బాధాకర విషయాన్ని తెలియజేస్తున్నాము. మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నామని కార్డులో ప్రచురించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లు ప్రచురించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ విచ్చేసి తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేశారు.
Sri. NANDAMURI TARAKA RATNA ( ceremony )
Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12 : 00pm Onwards at Film Nagar Culural Centre, Hyderabad.#NandamuriMohankrishna #NandamuriBalakrishna #VenumbakaVijayaSaiReddy #NandamuriFamily. pic.twitter.com/jfNa2HrpwE
— Telugu Film Producers Council (@tfpcin) February 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..