AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan- Venkatesh: పెళ్లి వేడుకలో సందడి చేసిన రామ్‌ చరణ్‌, వెంకీమామ.. ఏం చేశారో మీరే చూడండి

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, విక్టరీ వెంకటేశ్‌ అమెరికాలో జరిగిన ఓ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇటీవల ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డు అందుకున్నందుకు గానూ ఇదే వేదికపై రామ్‌ చరణ్‌కు అభినందనలు తెలిపారు వెంకీమామా.

Ram Charan- Venkatesh: పెళ్లి వేడుకలో సందడి చేసిన రామ్‌ చరణ్‌, వెంకీమామ.. ఏం చేశారో మీరే చూడండి
Ram Charan, Venkatesh
Basha Shek
|

Updated on: Feb 27, 2023 | 6:20 AM

Share

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, విక్టరీ వెంకటేశ్‌ అమెరికాలో జరిగిన ఓ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇటీవల ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డు అందుకున్నందుకు గానూ ఇదే వేదికపై రామ్‌ చరణ్‌కు అభినందనలు తెలిపారు వెంకీమామా. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ఆర్‌ చిత్రంలోని నాటునాటు పాట పేరెత్తగానే అతిథుల హర్ష ధ్వానాలతో పెళ్లి వేదిక మార్మోగి పోయింది. ఈ పెళ్లి ఎవరిదనే వివరాలు తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల కోసం చరణ్‌ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేశ్‌ కూడా అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరూ పెళ్లి వేడుకలో సందడి చేశారు.కాగా హెచ్‌సీఏ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా ‘బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ పురస్కారాలను చెర్రీ అనౌన్స్ చేశారు. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అంతర్జాతీయంగా అవార్డుల పంట పండిస్తోంది. హెచ్‌సీఏ అవార్డుల కన్నా ముందే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. మరోవైపు, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 13న (భారత కాలమానం ప్రకారం) ఉదయం జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..