Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య వీరసింహారెడ్డి పాటకు మెగా కోడలి మాస్‌ డ్యాన్స్‌.. సుగుణ సుందరి అంటూ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా సుగుణ సుందరి సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది.

బాలయ్య వీరసింహారెడ్డి పాటకు మెగా కోడలి మాస్‌ డ్యాన్స్‌.. సుగుణ సుందరి అంటూ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
Anchor Meghana
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2023 | 6:16 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా సుగుణ సుందరి సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇందులో బాలయ్య, శ్రుతి వేసిన ఊర మాస్‌ స్టెప్పులు అందరినీ అలరించాయి. అంతేగాక పలువురు నెటిజన్లు ఈ పాటకు డ్యాన్సులు వేశారు. తమదైన స్టైల్‌లో రీక్రియేట్‌ చేసి మెప్పించారు. తాజాగా మెగా కోడలు ప్రముఖ యాంకర్‌ మేఘన ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ వేసింది. మెగాస్టార్‌ ఫ్యామిలీకి దూరపు బంధవుయ్యే కొణిదెల పవన్‌ తేజ్‌తో మేఘనకు కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. స్టార్‌ యాంకర్‌గా వెలుగొందుతోన్న ఆమె సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. అలాగే సూపర్‌ హిట్‌ పాటలకు డ్యాన్సులేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. అలా తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి సుగుణ సుందరి అంటూ అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కొణిదేల పవన్‌ తేజ్‌ ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో మేఘన హీరోయిన్‌గా నటించింది. ఆతర్వాత పవన్‌ తేజ్‌ చిరంజీవి ఆచార్య, గాడ్‌ ఫాదర్‌ సినిమాల్లోనూ కనిపించి సందడి చేశాడు. అటు మేఘన కూడా బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోంది. రెచ్చిపోదాం బ్రదర్‌ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. అలాగే పలు స్పెషల్ షోలతో టీవీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగరైంది ఈ బ్యూటీ. కాగా పవన్‌ తేజ్‌, మేఘనల నిశ్చాతార్థం గతేడాది ఆగస్టులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, సాయి ధరమ్ తే డైరెక్టర్ మెహర్ రమేష్, కెవ్వు కార్తీక్, జబర్దస్త్ నటులు తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Megghanaa (@m_y_megganna)

View this post on Instagram

A post shared by Megghanaa (@m_y_megganna)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..