- Telugu News Photo Gallery Cricket photos Shardul Thakur Married To Mittali Parulkar Rohit Sharma And Shreyas Iyer Attend Wedding
Shardul Thakur: పెళ్లిపీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్.. సందడి చేసిన స్టార్ క్రికెటర్లు.. ఫొటోలు వైరల్
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. సోమవారం తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేశాడీ స్టార్ క్రికెటర్. ముంబై వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
Updated on: Feb 28, 2023 | 6:15 AM

టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. సోమవారం తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేశాడీ స్టార్ క్రికెటర్. ముంబై వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు శార్దూల్ ఠాకూర్, మిథాలీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

అంతకుముందు ఆదివారం జరిగిన సంగీత కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ పాల్గొన్నారు. రోహిత్ శర్మ భార్య రితిక, యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సంగీత్ ఈవెంట్‌లో స్పెషల్‌అట్రాక్షన్‌గా నిలిచారు.

మిథాలీ పారుల్కర్ ది బేక్స్ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని కలిగి ఉన్న మిథాలీ, ఆల్ ది జాజ్ - లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబై అంతటా వ్యాపారాలను నిర్వహిస్తోంది.

టీమిండియా స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ భార్య మాల్తీ చాహర్ కూడా వివాహ వేడుకలో కనిపించింది. అలాగే కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరయ్యారు.

వివాహం కారణంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన శార్దూల్ ఠాకూర్ ఆసీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా మళ్లీ భారత జట్టులో చేరనున్నాడు.





























