Actor Ali: మెరిట్‌ విద్యార్థులకు చేయూతనందించేందుకు ముందుకొచ్చిన నటుడు అలీ .. ఆస్ట్రేలియన్‌ కంపెనీతో కలిసి..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అలీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు తన వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు.

Actor Ali: మెరిట్‌ విద్యార్థులకు చేయూతనందించేందుకు ముందుకొచ్చిన నటుడు అలీ .. ఆస్ట్రేలియన్‌ కంపెనీతో కలిసి..
Actor Ali
Follow us

|

Updated on: Mar 01, 2023 | 7:15 AM

సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నటుడు అలీ. సినిమాలు, టీవీ షోలతో సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారీ స్టార్‌ కమెడియన్‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అలీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు తన వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో జతకట్టారు. బాగా చదువుకుని, ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ డబ్బుల్లేక ఇబ్బందిపడే ఎంతోమందికి సాయపడేందుకు ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియాకు వచ్చింది. ఈ సంస్థకు ‘ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌’ వ్యవహరించేందుకు ముందుకొచ్చారు అలీ. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అలీ.. ‘చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని ఆవేదన పడిపోతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం ఆనందంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు’ అని పేర్కొన్నారు.

కాగా గతేడాది ఓ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియాకు గెస్ట్‌గా వెళ్లారట అలీ. అక్కడ తెలుగువారంతా కలిసికట్టుగా చేస్తున్న మంచి పనులను దగ్గరి నుంచి చూశారట. ఇదే మంచి తెలుగువారికి కూడా చేయొచ్చు కదా ఆర్వేన్సిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఇవో శశి కొలికొండను కోరారట. ఆ మరుసటి రోజే దాదాపు 60 మందికి పైగా వచ్చి తెలుగు వారికి ఎలా ‘మార్చి 3, 4వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో మేమూ పాల్గొంటున్నాం. అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడటం ఆనందంగా ఉంది. పేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తాం’ అని ఆర్వేన్సిస్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..