AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevitha Rajasekhar: 33 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న జీవితా రాజశేఖర్‌.. ఆ స్టార్‌ హీరోకు సోదరిగా..

తలంబ్రాలు, జానకి రాముడు, అహుతి, అంకుశం, మగాడు తదితర హిట్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు జీవిత. చివరగా 1990లో మగాడు సినిమాలో కనిపించిన ఆమె అందులో హీరోగా యాక్ట్ చేసిన రాజశేఖరను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Jeevitha Rajasekhar: 33 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న జీవితా రాజశేఖర్‌.. ఆ స్టార్‌ హీరోకు సోదరిగా..
Actress Jeevitha Rajasekhar
Basha Shek
|

Updated on: Mar 01, 2023 | 12:03 PM

Share

యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ రాజశేఖర్‌ సతీమణిగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు జీవితా రాజశేఖర్‌. మొదట నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ ఆతర్వాత నిర్మాతగా, దర్శకురాలిగానూ సత్తాచాటారు. తలంబ్రాలు, జానకి రాముడు, అహుతి, అంకుశం, మగాడు తదితర హిట్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు జీవిత. చివరగా 1990లో మగాడు సినిమాలో కనిపించిన ఆమె అందులో హీరోగా యాక్ట్ చేసిన రాజశేఖరను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. ఇద్దరు కూతుళ్ల పెంపకంతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండిపోయారు. అయితే సినిమాలపై ఉండే మక్కువతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు తెరకెక్కించారు. భర్త రాజశేఖర్ హీరోగా శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ సినిమాలని జీవితనే డైరెక్ట్ చేశారు. అయితే సుమారు 33 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు జీవిత. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏకంగా సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారామె. ‘లాల్‌సలాం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జీవిత రాజశేఖర్‌ సోదరిగా నటించనున్నారు. మార్చి 7న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈసినిమాకు రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. గతంలో ధనుష్‌, శ్రుతిహాసన్‌ల కాంబినేషనల్‌ వచ్చిన 3 సినిమాకు ఐశ్వర్యనే దర్శకత్వం వహించారు. అలాగే ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. కాగా లాల్‌సలాం చిత్రంలోని ప్రధాన పాత్రలకు వెల్కమ్‌ చెబుతూ మూవీ యూనిట్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఇందులో రజనీకాంత్‌, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్‌ ఫొటోలను షేర్‌ చేశారు. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్‌ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..