- Telugu News Photo Gallery Cinema photos Hit Movies which released in start of this year like Waltair Veerayya, Veera Simha Reddy
Tollywood: ఈ ఏడాది స్టార్టింగ్ వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..
ఈ ఏడాది వచ్చి రెండు నెలలు అయ్యిపోయాయి. ఈ రెండు నెలల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లిస్ట్ కాస్త పెద్దదే..చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తేడా లేకుండా మంచి విజయాలను అందుకున్నాయి
Updated on: Mar 01, 2023 | 12:03 PM

ఈ ఏడాది వచ్చి రెండు నెలలు అయ్యిపోయాయి. ఈ రెండు నెలల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

అలాగే నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకూడా సూపర్ హిట్ అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా వారసుడు. అయితే ఈ సినిమా తమిళ్ సినిమా కేవలం తెలుగులోకి డబ్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినప్పటికీ కలెక్షన్స్ బాగా వచ్చాయి.

స్టార్ హీరో ధనుష్ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విద్య గొప్పతనాన్ని తెలిపే కథాంశం తో తెరకెక్కింది.

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైటర్ పద్మభూషణ్. సుహాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యం విష్ణుకథ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.





























