Telangana: రేయ్‌ ఎవర్రా మీరంతా.. చికెన్ ఉద్దెర ఇవ్వలేదని రచ్చ రచ్చ.. ఇక మాటల్లేవ్‌.. లేపేస్తానంటూ..

చికెన్ ఉద్దెర ఇవ్వలేదని ఓ వ్యక్తి రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా చికెన్‌షాప్‌ సూపర్‌ వైజర్‌ ఇంటిపై దాడి చేశాడు. అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా బైక్‌పై కత్తితో పాడు ఓ మెమరీ కార్డును ఉంచాడు.

Telangana: రేయ్‌ ఎవర్రా మీరంతా.. చికెన్ ఉద్దెర ఇవ్వలేదని రచ్చ రచ్చ.. ఇక మాటల్లేవ్‌.. లేపేస్తానంటూ..
Death Threat
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 12:42 PM

చికెన్ ఉద్దెర ఇవ్వలేదని ఓ వ్యక్తి రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా చికెన్‌షాప్‌ సూపర్‌ వైజర్‌ ఇంటిపై దాడి చేశాడు. అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా బైక్‌పై కత్తితో పాడు ఓ మెమరీ కార్డును ఉంచాడు. అందులో అంతుచూస్తానంటూ ఓ ఆడియోను రికార్డ్‌ చేసి హెచ్చరించాడు. వరంగల్‌ పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలో చెందిన మధుకర్ అనే వ్యక్తి అలంకర్ జంక్షన్ లోని వెరైటీ చికెన్ సెంటర్ లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఓ గుర్తుతెలియని వ్యక్తి చికెన్ షాప్ దగ్గరకు వచ్చి చికెన్ ఉద్దెర అడిగాడు. అయితే ఎప్పుడూ చూడని ముఖం కావడంతో మధుకర్ చికెన్‌ ఇవ్వనన్నాడు. దీంతో సదరు గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం అర్ధ రాత్రి కాశీబుగ్గలోని మధుకర్ ఇంటికి వచ్చాడు. అతని ఇంట్లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా అదే ద్విచక్ర వాహనంపై ఒక కత్తి గుచ్చాడు. తనకు చికెన్ ఉద్దెర ఇవ్వనందుకు మధుకర్ అంతు చూస్తానంటూ, ఆడియో రికార్డు చేసిన ఒక మెమొరీ కార్డు, బైక్ పై పెట్టి హెచ్చరించాడు.

కాగా మధుకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సదరు గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల ఏపీలోని పల్నాడు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వాలంటీర్‌ పెన్షన్‌ ఇవ్వాలంటే మటన్‌ ఇవ్వాలని కండీషన్‌ పెట్టాడు. సదరు పెన్షన్‌ దారుడు బతిమాలినా వాలంటీర్ అసలు పట్టించుకోలేదు. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉండడంతో వాలంటీర్‌ ఇలా వింత నిబంధన పెట్టాడని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
ఈ ఫొటోలో ఓ పిల్లిని మీరు సెలెక్ట్ చేస్తే.. మీరెలాంటివారో చెప్తామ్
ఈ ఫొటోలో ఓ పిల్లిని మీరు సెలెక్ట్ చేస్తే.. మీరెలాంటివారో చెప్తామ్