Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: వాడి లవర్‌ వాడి ఇష్టమంటా.. నాగశౌర్య వీడియోపై యాంకర్‌ రష్మీ రియాక్షన్‌ .. నెటిజన్ల ట్రోలింగ్‌

పాపం స్టార్‌ యాంకర్‌ రష్మీ ఇటీవల ఏం మాట్లాడినా  ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆమె చెప్పే మాటలను అర్థం చేసుకోలేని నెటిజన్లు అదే పనిగా ఆమెపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.

Rashmi Gautam: వాడి లవర్‌ వాడి ఇష్టమంటా.. నాగశౌర్య వీడియోపై యాంకర్‌ రష్మీ రియాక్షన్‌ .. నెటిజన్ల ట్రోలింగ్‌
Rashmi Gautam
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 9:18 AM

పాపం స్టార్‌ యాంకర్‌ రష్మీ ఇటీవల ఏం మాట్లాడినా  ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆమె చెప్పే మాటలను అర్థం చేసుకోలేని నెటిజన్లు అదే పనిగా ఆమెపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల అంబర్‌పేట వీధికుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటనపై స్పందించి ట్రోలింగ్‌కు గురైంది రష్మీ. తాజాగా నాగశౌర్య వీడియోపై స్పందించి మరోసారి నెటిజన్లకు చిక్కిపోయింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం (ఫిబ్రవరి 28) నాగశౌర్య రోడ్డు మీద ఓ యువకుడితో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఓ అమ్మాయిని కొడుతున్న యువకుడిని అడ్డుకున్న శౌర్య అమ్మాయికి క్షమాపణ చెప్పాలని సదరు కుర్రాడిని నిలదీశాడు. ఇదే సమయంలో అదే రహదారిపై ప్రయాణిస్తున్న వారు కూడా నాగశౌర్య చేసిన పనిని సమర్థించారు. సదరు యువకుడి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది శౌర్య చేసిన పనిని ప్రశంసించారు. వాడిని అలాగే కొట్టాలంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం యువకుడిపై హీరోయిజం చూపించడమేంటని, రోడ్డుపై నిలదీయడం తప్పంటూ శౌర్యను తప్పుపడుతున్నారు. వాని లవర్ వాడి ఇష్టం మధ్యలో మనం ఎందుకు వెళ్లడం అని మరి కొందరు స్పందిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చూసిన యాంకర్‌ రష్మీకి ఒళ్లంతా మండినట్లుంది. నెటిజన్ల ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్‌ వేదికగా కడిగి పారేసింది.

ఇవి కూడా చదవండి

‘వాడి లవర్ వాడి ఇష్టం అంటా.. అమ్మాయే సపోర్ట్ చేస్తోందిగా.. ఇలాంటి కామెంట్లు చూస్తుంటే సిగ్గేస్తోంది.. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరికేం తెలుసు.. మీరు మరో ఆత్మహత్య ఘటన చూడాలని కోరుకుంటున్నారా? అని నెటిజన్లను నిలదీసింది రష్మీ. ప్రస్తుతం రష్మీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు సపోర్టుగా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం ఎప్పటిలాగే ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ‘ఎప్పుడూ అబ్బాయిలను తక్కువ చేసి మాట్లాడడమేనా? అసలు విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇలాంటి సీన్లు మీ జబర్దస్త్‌లో నిత్యం కనిపిస్తుంటాయి కదా.. అక్కడేమో నవ్వుతుంటావ్‌.. ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడతావా? అంటూ నెగెటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రష్మీ ఏది మాట్లాడినా ప్రస్తుతం ట్రెండ్‌ అయిపోతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..