Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ విశ్వసుందరి.. హార్ట్ అటాక్‌కు గురైన సుస్మితాసేన్..

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ షాకింగ్ పోస్ట్ చేశారు. ఆమె హార్ట్ అటాక్ కి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఒక్కసారిగా కలకలం రేపింది.

Sushmita Sen: ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ విశ్వసుందరి.. హార్ట్ అటాక్‌కు గురైన సుస్మితాసేన్..
Sushmita Sen
Follow us
Surya Kala

|

Updated on: Mar 03, 2023 | 6:51 AM

మాజీ విశ్వ సుందరి.. బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్ సడన్ షాక్ ఇచ్చారు. తనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు చెప్పి కలకలం రేపారు. కొద్దిరోజుల క్రితం తాను గుండెపోటుకి గురయ్యానని, వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, గుండెలోపల స్టెంట్ అమర్చారని సుస్మితాసేన్ ఇంస్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యులు చెప్పారన్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాసులకు విషయం తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయం చెప్పాననన్నారు. సుస్మితాసేన్ సడన్‌గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అంతా షాకయ్యారు. అభిమానులు ఆమెకు ఏం కాకూడదని కోరుకుంటున్నారు. హార్ట్ అటాక్ నుండి క్షేమంగా బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

47 ఏళ్ల సుస్మితాసేన్ చాలా కాలం తనకన్నా 15 ఏళ్ల చిన్నవాడైనా మోడల్ రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వీరి రిలేషన్‌కి బీజం పడింది. ఇంస్టాగ్రామ్‌లో రొహ్మన్ షాల్ సుస్మితాసేన్‌కి డైరెక్ట్ మెసేజ్ చేశారట. సింగిల్ గా ఉన్న సుస్మితాసేన్ రోహ్మన్ సందేశానికి స్పందించటంతో అలా వారి బంధం మొదలైంది. ఐతే 2021లో సుస్మితా, రోహ్మన్ మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో బ్రేకప్ చెప్పుకున్నారు. 2022 జులై నెలలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో రిలేషన్ పెట్టుకున్నట్లు సుస్మిత వెల్లడించారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుస్మితాసేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్నారు. సుస్మితాసేన్ వివాహం చేసుకోలేదు. ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. 1996లో విడుదలైన దస్తక్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం సుస్మితాసేన్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఆర్య, ఆర్య 2 సిరీస్లలో సుస్మితా లీడ్ రోల్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..