AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టు.. చేతికి గాజులు చూపిస్తూ మురిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? బోలెడు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందండోయ్‌..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇలా అన్ని రకాల సోషల్‌ మీడియా మాధ్యమాల్లోనూ సినిమా తారలు యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం వారి గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు.

చీరకట్టు.. చేతికి గాజులు చూపిస్తూ మురిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? బోలెడు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందండోయ్‌..
Actress
Basha Shek
|

Updated on: Mar 02, 2023 | 9:28 PM

Share

సోషల్ మీడియా విస్తృతి పెరిగాక సినిమా తారలు, వారి అభిమానుల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇలా అన్ని రకాల సోషల్‌ మీడియా మాధ్యమాల్లోనూ సినిమా తారలు యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం వారి గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. అలాగే తమ సినిమా కెరీర్‌ విశేషాలతో పాటు పర్సనల్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన తారల ఫొటోలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సినిమా తారలు ఇలా షేర్‌ చేయడం లేట్‌.. అభిమానులు, నెటిజన్ల షేర్లతో క్షణాల్లోనే అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో సంప్రదాయ చీరకట్టు, చేతికి గాజులు చూపిస్తూ మురిసిపోతోంది ఓ స్టార్‌ యాంకర్‌. తెలుగు నాట ఈమెకు బోలెడు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందండోయ్‌. ఈ మధ్యన స్మాల్‌ స్ర్కీన్‌తో పాటు సిల్వర్‌ స్ర్కీన్‌పై కూడా తెగ సందడి చేస్తోంది. వరుసగా సినిమాల్లో నటిస్తోంది. సోషల్‌ మీడియాలో అయితే ఈమె ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోతోంది. ఇలా తన అందం, అభినయంతో తెలుగు నాట దూసుకుపోతోన్న ఈ అందాల తార మరెవరో కాదు..

స్టార్‌ యాంకర్‌ అనసూయ. నెట్టింట్లో తెగ చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక వీడియోను షేర్‌ చేసింది. అందులో అచ్చమైన సంప్రదాయ చీరకట్టుతో మురిసిపోయింది అనసూయ. అలాగే చేతికున్న గాజులు చూపిస్తూ హొయలు పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలతోనూ బిజీగా ఉంటోంది. ఆమె చేతిలో పుష్ప 2తో కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాలున్నాయి. అలాగే కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్